RV Foundation : RV ఫౌండేషన్ ఆధ్వర్యంలో Miracle హాస్పిటల్ వారి సహాకారంతో ఉచిత వైద్య శిబిరం..!
ప్రధానాంశాలు:
RV ఫౌండేషన్ ఆధ్వర్యంలో Miracle హాస్పిటల్ వారి సహాకారంతో ఉచిత వైద్య శిబిరం..!
RV Foundation : మహిళలు, చిన్నారుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు RV ఫౌండేషన్, బాలాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, మిరాకిల్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ప్రజల అపూర్వ స్పందనతో విజయవంతమైంది.ఈ ఉచిత వైద్య శిబిరం గణేష్ మండపం, బాలాజీ నగర్ కాలనీ, పీర్జాదిగూడ లో ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు జరిగింది. శిబిరానికి అనేక మంది మహిళలు, పిల్లలు హాజరై ఉచిత వైద్య పరీక్షలు, ఆరోగ్య సలహాలు, ఔషధాలు పొందారు.ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు, ఆరోగ్య నిపుణులు వివిధ ఆరోగ్య సమస్యలపై ప్రాధమిక వైద్య పరీక్షలు, రక్తపరీక్షలు, రక్తపోటు, షుగర్ టెస్ట్‌లు, మరియు పోషకాహార సూచనలు అందజేశారు.ప్రత్యేకంగా, మహిళలకు గైనకాలజీ, శిశువులకు పీడియాట్రిక్ సేవలు అందించడంతో పాటు, ఆరోగ్యపరమైన అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి.

RV Foundation : RV ఫౌండేషన్ ఆధ్వర్యంలో Miracle హాస్పిటల్ వారి సహాకారంతో ఉచిత వైద్య శిబిరం..!
RV Foundation ప్రజల విశేష స్పందన – భవిష్యత్తులో మరిన్ని శిబిరాలు-తుంగతుర్తి రవి…
ఈ సందర్భంగా RV ఫౌండేషన్ వ్యవస్థాపకుడు & పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి మాట్లాడుతూ:”మహిళలు, పిల్లల ఆరోగ్య పరిరక్షణ మా ప్రధాన లక్ష్యం. ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా అనేక మంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించగలగడం ఆనందంగా ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఇలాంటి మరిన్ని వైద్య శిబిరాలను నిర్వహించేందుకు మేము కట్టుబడి ఉన్నాం.ఈ సేవలను ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇంకా విస్తృతంగా ఆరోగ్య కార్యక్రమాలను చేపడతామని హామీ ఇస్తున్నాను.” అని అన్నారు.వైద్యుల సేవలకు ప్రజలు విశేషంగా స్పందించారు.
పీర్జాదిగూడ ప్రాంత ప్రజలు RV ఫౌండేషన్, మిరాకిల్ హాస్పిటల్, బాలాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.RV ఫౌండేషన్ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. భవిష్యత్తులో పీర్జాదిగూడ లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తాం అని అన్నారు.ఈ కార్యక్రమం లో పన్నాల శ్రీనివాస్ రెడ్డి,బండి శ్రీ రాములు,మహిళా అధ్యక్షురాలు శ్రీలత భద్రు నాయక్, ఎన్ ఎన్ కె దుర్గ, బాలాజీ నగర్ కాలనీ కమిటీ సభ్యులు,మరియు హాస్పిటల్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ లోని ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు,కాలనీ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.