Uppal : ఫలించిన పరమేశన్న కృషి.. మంత్రి ఆదేశాలతో జీహెచ్ఎంసీ చేతికి ఉప్పల్ రహదారి పనులు..!
ప్రధానాంశాలు:
Uppal : ఫలించిన పరమేశన్న కృషి.. మంత్రి ఆదేశాలతో జీహెచ్ఎంసీ చేతికి ఉప్పల్ రహదారి పనులు..!
Uppal : ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ మందుముల పరమేశ్వర్‌రెడ్డి mandumula parameshwar reddy, కృషి ఫలించింది. ఫలితంగా అతిత్వరలోనే Uppal Roads ఉప్పల్ రింగురోడ్డు- నల్లచెరువు వరకు రహదారి పనులు ప్రారంభం కానున్నాయి. ఉప్పల్‌లో Uppal to Warangal Hiway వరంగల్ జాతీయ రహదారిపై వాహనదారుల, స్థానికుల కష్టాలు తీరనున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆదేశాలతో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారు రహదారిని నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కారిడార్‌తో సంబంధం లేకుండా రోడ్డు నిర్మాణం, మరమ్మతు వంటి పనులను వెంటనే చేపట్టనున్నారు.ఉప్పల్ -నారపల్లి మధ్యలో చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులతో ఉప్పల్‌లో వరంగల్ జాతీయ రహదారి అధ్వాన్నంగా మారింది.

Uppal : ఫలించిన పరమేశన్న కృషి.. మంత్రి ఆదేశాలతో జీహెచ్ఎంసీ చేతికి ఉప్పల్ రహదారి పనులు..!
Uppal కమిషనర్ గ్రీన్ సిగ్నల్‌తో అతిత్వరలోనే ప్రారంభం కానున్న పనులు
వర్షాకాలంలో వరద, బురద.. వేసవిలో దుమ్ము చెలరేగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ మందుముల పరమేశ్వర్‌రెడ్డి చేసిన కృషి ఫలించింది.ఉప్పల్‌లో వరంగల్ జాతీయ రహదారి నేషనల్ హైవేస్, ఆర్ అండ్ బీ కంట్రోల్‌లో ఉంది. ఏదైనా రోడ్డు అభివృద్ధి, మరమ్మతు పనులనే ఈ రెండు విభాగాలే చేపట్టాలి. ఎలివేటెడ్ కారిడార్ పనులు ముందుకు పోక.. ఉప్పల్‌లో ఈ రెండు విభాగాలు ఎలాంటి పనులను చేపట్టకపోవడంతో రహదారి పరిస్థితి దుర్భరంగా ఉంది.
ఇదే విషయాన్ని పరమేశ్వర్‌రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్ అండ్ బీ, నేషనల్ హైవేఎస్ నుంచి ఎన్ఓసీ తీసుకొని ఈ పనులను జీహెచ్ఎంసీకి అప్పగించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించడమే కాకుండా వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్‌కు, ఆర్ అండ్ బీ ఉన్నతాధికారి ధర్మారెడ్డికి మంత్రి ఫోన్‌లో ఇదే విషయాన్ని చెప్పారు. ఇద్దరూ కూడా సానుకూలంగా స్పందించడంతో అతిత్వరలోనే సమ్యకు పరిష్కారం లభించనుంది. పరమేశ్వర్‌రెడ్డి చూపిన చిన్న చొరవతో లక్షలాది మంది కష్టాలు తీరనున్నాయి..