Good News : రైతులకు భారీ శుభవార్త.. ద‌స‌రా నాటికి వారందరికీ రుణమాఫీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Good News : రైతులకు భారీ శుభవార్త.. ద‌స‌రా నాటికి వారందరికీ రుణమాఫీ..!

Good News : తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 30 కల్లా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పింది. అంతేకాకుండా రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తామని పేర్కొంది. అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల క్షేత్ర‌స్థాయిలో వేల‌ మంది రైతులకు రుణమాఫీ కాలేదు. దాంతో వారు ఆందోళనలు చెయ్యడం, ప్రతిపక్షాలు గొంతు కలపడంతో సీఎం రేవంత్ సర్కార్ మెట్టు దిగింది. భారీ స్థాయిలో రుణమాఫీ కోసం ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈసారి ప్ర‌భుత్వ‌ చర్యలు రైతులకు […]

 Authored By ramu | The Telugu News | Updated on :2 October 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Good News : రైతులకు భారీ శుభవార్త.. ద‌స‌రా నాటికి వారందరికీ రుణమాఫీ..!

Good News : తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 30 కల్లా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పింది. అంతేకాకుండా రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తామని పేర్కొంది. అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల క్షేత్ర‌స్థాయిలో వేల‌ మంది రైతులకు రుణమాఫీ కాలేదు. దాంతో వారు ఆందోళనలు చెయ్యడం, ప్రతిపక్షాలు గొంతు కలపడంతో సీఎం రేవంత్ సర్కార్ మెట్టు దిగింది. భారీ స్థాయిలో రుణమాఫీ కోసం ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈసారి ప్ర‌భుత్వ‌ చర్యలు రైతులకు పెద్ద ఊరటనివ్వనున్నాయి. రీ-సర్వేలో రూ.2 లక్షల వరకు రుణమాఫీకి అనర్హులైన రైతుల వివరాలను సేకరించారు. వారి భూముల వివరాలు, సెల్ఫీ ఫోటోలను కూడా తీసుకుని, సమగ్ర లెక్కలు సిద్దం చేశారు. ఆధార్, బ్యాంక్ అకౌంట్లలో ఉన్న చిన్నపాటి తప్పిదాల కారణంగా సుమారు 1.50 లక్షల మంది రైతులకు రుణమాఫీ పూర్తికాలేదని తేల్చారు.

తెలంగాణలో రేషన్ కార్డు లేని రైతులు చాలా మంది ఉన్నారు. రేషన్ కార్డు లేకపోవడం వల్ల వారు రుణమాఫీకి అన‌ర్హులుగా మిగిలారు. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందిస్తూ, రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో తాజా సర్వేలో రేషన్ కార్డు లేని 4 లక్షల మంది రైతులు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం వారి రుణాలను కూడా మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Good News అర్హుల వివరాలు

అధికారులు అర్హులను ఎంపిక చేసుకునే ప్రక్రియలో కచ్చితత్వం పాటించారు. ప్రస్తుతం మొత్తం 5 లక్షల మందికిపైగా అర్హులైన రైతుల జాబితా సిద్ధంగా ఉంది. ప్రభుత్వం వారి బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేయడానికి చర్యలు తీసుకుంటుంది. బ్యాంకర్లు ఇప్పటికే రూ.5 వేల కోట్ల నిధులను సిద్ధంగా ఉంచారు.

Good News రైతులకు భారీ శుభవార్త ద‌స‌రా నాటికి వారందరికీ రుణమాఫీ

Good News : రైతులకు భారీ శుభవార్త.. ద‌స‌రా నాటికి వారందరికీ రుణమాఫీ..!

అక్టోబర్ మొదటి వారంలో రుణ‌మాఫీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చు. లేదా అక్టోబర్ 12న దసరా నాటికి ఇవ్వొచ్చు. ఏదో ఒకటి చేసి, త్వరగా ఇచ్చేస్తే రైతులకు వడ్డీల భారం తగ్గుతుంది. ఐతే.. రూ.2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతుల సంగతి ఇంకా తేలలేదు. మరి వారికి ఎప్పుడు మాఫీ అవుతుందో చెప్పలేని పరిస్థితి. వారికి వడ్డీ భారం మరింత ఎక్కువగా ఉంటుంది. ఆలస్యం అయ్యే కొద్దీ.. అదంతా ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ఆ భారం ప్రభుత్వంపై పడుతుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది