Inter Students : ఇంటర్ మూల్యాంకనంపై బోర్డ్ కొత్త నిర్ణయం.. విద్యార్ధులకి శుభవార్త
ప్రధానాంశాలు:
Inter Students : ఇంటర్ మూల్యాంకనంపై బోర్డ్ కొత్త నిర్ణయం.. విద్యార్ధులకి శుభవార్త
Inter Students : మార్చి 25న ఇంటర్ పరీక్షలు పూర్తి కాగా, ఈ పరీక్షలకి మొత్తం 9,96,971 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. అయితే 98% మంది పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు ముగిసిన వెంటనే ఇంటర్ బోర్డు అన్ని సబ్జెక్టుల సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించింది. 19 కేంద్రాల్లో సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోంది. మరో వారం రోజుల పాటు ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.

Inter Students : ఇంటర్ మూల్యాంకనంపై బోర్డ్ కొత్త నిర్ణయం.. విద్యార్ధులకి శుభవార్త
Inter Students మంచి వార్త..
ఈ క్రమంలో, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, ఉప కార్యదర్శులను మూల్యాంకన కేంద్రాలకు వెళ్లి ఇప్పటికే మూల్యాంకనం పూర్తయిన పత్రాలను సమీక్షించాలని ఆదేశించారు. ప్రత్యేకంగా 10 లోపు, 30-35 మధ్య, 90కి పైగా మార్కులు సాధించిన విద్యార్థుల జవాబు పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసే అధ్యాపకులు బాధ్యతగా వ్యవహరించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దీనిపై స్పందించిన బోర్డు అధికారులు, మూల్యాంకన కేంద్రాల్లో సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ప్రతీ జవాబు పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.ఇంటర్ ఫలితాల ప్రకటన తర్వాత, విద్యార్థులకు అనుమానాలు ఉంటే ఒక్కో సబ్జెక్టుకు రూ.600 చెల్లించి రీ వాల్యువేషన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంటర్ బోర్డులో అమలు చేస్తున్న ఈ నియమాలను కొంత మంది అధ్యాపకులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.