Ration Card : గుడ్ న్యూస్… రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్…!
Ration Card : తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరు గ్యారెంటీల పేరుతో ఎన్నో పథకాలను అందించింది. అయితే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త […]
ప్రధానాంశాలు:
Ration Card : గుడ్ న్యూస్... రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్...!
Ration Card : తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరు గ్యారెంటీల పేరుతో ఎన్నో పథకాలను అందించింది. అయితే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులను అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నారు. వాటిని పక్కదారి పట్టకుండా కఠిన చర్యలను అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ కేవైసీ అనేది ముఖ్యమని చెప్పారు. వీటి గురించి తెలియని వారు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది..
అందుబాటులో ఉన్న రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ కేవైసీ చేసుకోవాలని అధికారులు ప్రజలు తెలిపారు. వేలిముద్రల ఆధారంగానే రేషన్ కార్డులో ఉన్న పేరు ఆధారంగా కుటుంబంలో సభ్యుడా కాదా అనేది నిర్ధారించుకోవచ్చు.. ఈ విధంగా చేయడం వలన అర్హులు మాత్రమే పొందుతారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు చాలామంది ఈ కేవైసీ పూర్తి చేసుకుని ఉన్నారు. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు వేలిముద్రలు పడక చాలామంది తంటాలు పడుతున్నారు. దీంతో పాటు సాంకేతిక సమస్యలు కూడా తోడయ్యాయి. దాంతో చాలామంది ఈ కేవైసీ చేయించుకోలేకపోయారు. ఆధార్ సెంటర్ మీసేవకు వెళ్లి పూర్తి వివరాలను అప్డేట్ చేసుకున్న చాలామంది ఈ కేవైసీ పూర్తి అవడం లేదు. వలస వెళ్లిన వారికోసం అక్కడ ఉండే రేషన్ షాపులలో ఈ కేవైసీ చేసుకునే వెసులుబాటు ఉన్న కొందరు డీలర్లు తమ పరిధిలోని వారికి ఈ కేవైసీ ప్రక్రియను అందించడం జరుగుతుంది.
అలాగే కొన్ని జిల్లాలు ఈ కేవైసీ కోసం డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. లబ్ధిదారులలో ఎప్పటి వరకు 70% వరకు మాత్రమే ఈ ప్రక్రియ పూర్తి అవ్వగా ఇంకా 25 శాతం వరకు ఈ కేవైసీ పెండింగ్లో ఉన్నదని తెలుస్తోంది.అయితే ఫిబ్రవరి 29 తోనే ఈ కేవైసీ చేయించుకునే గడువు ముగిసిన ఇంకా రేషన్ దుకాణాలు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. సివిల్ సప్లై అధికారులు కూడా ఇంకా ఈ కేవైసీ చేయించుకోని వారు రేషన్ డీలర్ల వద్ద చేయించుకోవాలని చెప్తున్నారు ప్రభుత్వం తుది గడువు అనేది ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతానికైతే ఈ కేవైసీ చేయించుకోవచ్చు అని అధికారులు చెప్తున్నారు.. కావున ఈ కేవైసీ కానీ ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తెలుపుతోంది.