Rtc Bill : ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం బిల్లు విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి బిగ్గెస్ట్ షాక్ ఇచ్చిన గవర్నర్ తమిళి సై..!!
Rtc Bill : వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చాలా నిర్ణయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగాల విషయంలో దాదాపు కొన్ని వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయటంతో పాటు ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో తెలంగాణా ఆర్టీసీ ఉద్యోగులలో సంతోషం నెలకొంది. ఈ క్రమంలో ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టాలనుకున్న కేసీఆర్ ప్రభుత్వానికి ఊహించిన ట్వీస్ట్ ఎదురయ్యింది.
ఆర్థికపరమైన బిల్లు కావటంతో గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం బిల్లును పంపించగా ఇప్పటివరకు గవర్నర్ తమిళి సై ఆమోదం లభించలేదట. ఈ పరిణామంతో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులలో గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే రాజ్ భవన్ వర్గాలు తమకు ఎలాంటి బిల్లు అందలేదని చెబుతుండగా మరోపక్క ఆర్టీసీ బిల్లును గవర్నర్ కార్యాలయానికి పంపించినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఆర్టీసీ విలీనం బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదింప చేయాలని ఇందుకు సంబంధించి క్యాబినెట్ కూడా ఆమోదం తెలపడం జరిగింది. అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో చివరి నిమిషంలో గవర్నర్ తమిళి సై.. వద్ద బిల్లు ఆగిపోవడంతో పాటు ఆమోదం పొందకపోవటంతో..కేసీఆర్ ప్రభుత్వానికి బిగ్గెస్ట్ ఊహించని షాక్ ఇచ్చినట్లయిందట.
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిల్లు ఆమోదింప చేసుకుని.. మైలేజ్ పొందాలని కేసీఆర్ ప్రభుత్వం భావించగా చివరి నిమిషంలో ఈ రకంగా బిల్లు గవర్నర్ వద్ద ఆగిపోయినట్లు టాక్. మరో పక్క తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆదివారంతో ముగియనున్నాయి. ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం బిల్లు విషయంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది.