Ration Cards : గుడ్ న్యూస్ .. కొత్త రేషన్ కార్డులపై ప్ర‌భుత్వం కీల‌క అప్‌డేట్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ration Cards : గుడ్ న్యూస్ .. కొత్త రేషన్ కార్డులపై ప్ర‌భుత్వం కీల‌క అప్‌డేట్‌..!

 Authored By anusha | The Telugu News | Updated on :8 January 2024,5:19 pm

ప్రధానాంశాలు:

  •  Ration Cards : గుడ్ న్యూస్ .. కొత్త రేషన్ కార్డులపై ప్ర‌భుత్వం కీల‌క అప్‌డేట్‌..!

Ration Cards : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ప్రజా పాలన పేరుతో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. జనవరి 6వ తేదీతో ఈ దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయింది. లబ్ధిదారుల నుంచి మొత్తం ఏకంగా 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో 19 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన అన్ని హామీలకు రేషన్ కార్డులను ప్రామాణికం తీసుకుంటున్న క్రమంలో రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

డూప్లికేట్ కార్డులను తొలగించి అర్హులకు కొత్త కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తయిన తర్వాత ప్రతి ఇంటికి ప్రభుత్వ సిబ్బంది వెళ్లి పరిశీలన చేసిన అనంతరం కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుందిష శివరాత్రి నాటికి కొత్త రేషన్ కార్డు దారులను రేషన్ పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు దరఖాస్తు సమర్పించినవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించారు. దరఖాస్తులు ఇవ్వనివారు గ్రామంలోని పంచాయతీ కార్యదర్శి లేదా మండల పరిషత్ కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు.

ఇక ఈ కార్యక్రమానికి చివరి గడువు అంటూ లేదని ఇది నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా రాష్ట్రంలో లక్షకు పైగా రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేస్తుందంటూ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వీటిపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డుల రద్దు వార్త పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు కూడా రద్దు చేయడం లేదని తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరికి రేషన్ అందుతుందని తెలిపారు. లక్ష మందికి పైగా రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే వీటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏ ఒక్క రేషన్ కార్డ్ రద్దు చేయడం లేదని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది