Harish Rao : హరీష్ రావా మజాకా… టీఆర్ఎస్ లో ఏ ఎమ్మెల్యే కూడా పనికి రాడు..!
Harish Rao : తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటకు ప్రత్యేక స్థానం ఉంటుంది అనడంలో సందేహం లేదు. అక్కడ ప్రజలు మొత్తం కూడా హరీష్ రావు గీచిన గీత దాటరు అనడంలో సందేహం లేదు. అక్కడి ప్రజలు ఇది కావాలని అడుగక ముందే హరీష్ రావు తెలుసుకుని ఇస్తున్నాడు. హైదరాబాద్ కంటే అత్యున్నత సిటీగా సిద్దిపేటను మార్చడంలో హరీష్ రావు రాత్రి పగలు కష్టపడుతున్నాడు. మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా తన శాఖ బాధ్యతలు చూసుకుంటూనే మరో వైపు తన సొంత నియోజక వర్గంను అభివృద్ది విషయంలో ఆగకుండా కంటిన్యూగా నులు చేయిస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో హైదరాబాద్ లో తప్ప మరెక్కడా లేని విధంగా సిద్ది పేటలో ఎన్నో అద్బుతమైన సుదీకరీకరణ పనులు జరిగాయి.

Harish rao about siddipet municipality development
Harish Rao : 10 సార్లు జాతీయ అవార్డులు.. :
సిద్దిపేట సుందరీకరణలో భాగంగా ఎన్నో ఇచ్చాడు. సిద్ది పేట అభివృద్ది నేపథ్యంలో 43 వార్డులకు మొత్తం 43 వార్డులు టీఆర్‌ఎస్ గెలిచింది. ఇంత భారీ విజయాన్ని సిద్ది పేట వాసులు ఇవ్వడంతో వారికి మరింతగా అభివృద్ది ఫలాలను అందించేందుకు హరీష్ రావు కృషి చేస్తూనే ఉన్నాడు. దేశంలోనే పలు విభాగాల్లో అత్యున్నత సిటీగా సిద్దిపేట నిలిచింది అనడంలో సందేహం లేదు. సిద్దిపేటకు కేంద్రం నుండి ఇప్పటి వరకు 10 సార్లు జాతీయ స్థాయి అవార్డులకు ఎంపిక చేయడం జరిగింది. ఈ జాతీయ అవార్డులతో సిద్దిపేట ఏ రేంజ్ లో అభివృద్దిలో దూసుకు పోతుందో అర్థం చేసుకోవచ్చో అంటూ మంత్రి హరీష్ రావు అంటున్నారు.
Harish Rao : దేశంలోనే మోడల్ సిటీగా.. :
తాజాగా హరీష్ రావు సిద్దిపేటలో పర్యటించాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట నెక్లెస్ రోడ్డు రాష్ట్రంకు ఆదర్శం. 15 కోట్లతో సింథటిక్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశాం. సైక్లింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసుకున్నాం. రెండున్నర కోట్లతో ఫుట్ బాల్ స్టేడియంను ఏర్పాటు చేయబోతున్నాం. వాలీబాల్ అకాడమీ కూడా ఏర్పాటు చేయిస్తాం. సిద్దిపేట మొత్తం సీసీ కెమెరాలు మరియు మ్యూజిక్ సిస్టమ్ తో అందరి దృష్టిని ఆకర్షించేలా చేస్తాం అంటూ హరీష్ రావు హామీ ఇచ్చాడు. మోడల్ సిటీగా సిద్ది పేటను దేశంకే ఆదర్శంగా తీర్చిదిద్దుతామంటూ హరీష్ రావు అన్నాడు.