Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం పథకానికి సంబదించిన గుడ్ న్యూస్ తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి
ప్రధానాంశాలు:
Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం పథకానికి సంబదించిన గుడ్ న్యూస్ తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ Telangana Govt రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం రాష్ట్ర యువత జీవితాల్లో నూతన మార్గాన్ని చూపించనుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పథకం మంజూరు లేఖల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల మధ్య లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయాలని సూచించారు.

Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం పథకానికి సంబదించిన గుడ్ న్యూస్ తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి
Rajiv Yuva Vikasam Scheme : 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు – భట్టి
ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.6,250 కోట్ల నిధులతో సుమారు 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం ద్వారా యువతకు అవసరమైన ఆర్థిక సాయం అందించడంతో పాటు, వారు వ్యాపారాలు ప్రారంభించి ఆదాయ మార్గాలు ఏర్పరచుకునేలా చేయనున్నారు. నిజమైన లబ్ధిదారులు ఎంపికై న్యాయం పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకం రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలు పెరిగేందుకు దోహదపడుతుందని, తద్వారా రాష్ట్ర జీడీపీ పెరిగే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజీవ్ యువ వికాసం పథకం కేవలం ఆర్థిక సాయం అందించడానికే కాక, లబ్ధిదారులు నిజంగా ప్రయోజనం పొందుతున్నారా లేదా అన్న విషయాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. చిన్నచిన్న సవాళ్ల వల్ల యువత తమ యూనిట్లను కొనసాగించలేకపోతే, స్థానిక అధికారులు జోక్యం చేసుకుని సహాయం చేయాలని సూచించారు. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమిస్తామని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం యువత సామర్థ్యాన్ని ప్రోత్సహించి, వారి భవిష్యత్తును వెలుగునింపడమేనని పేర్కొన్నారు.