KCR : కేసీఆర్ కు తలనొప్పిగా మారిన కవిత ,కేటీఆర్..!
ప్రధానాంశాలు:
KCR : కేసీఆర్ కు తలనొప్పిగా మారిన కవిత ,కేటీఆర్..!
KCR : తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో “అపర చాణుక్యుడు”గా పేరుగాంచిన ఆయన, ప్రస్తుతం తన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత మధ్య రాజకీయ సమన్వయం చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణపై కవిత రాసిన లేఖ ఈ భిన్నాభిప్రాయాలను బహిరంగంగా తీసుకువచ్చింది. ఈ లేఖలో కవిత బీజేపీపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం, తనకు పార్టీలో స్థానం లేనట్లుగా పేర్కొనడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

KCR : కేసీఆర్ కు తలనొప్పిగా మారిన కవిత ,కేటీఆర్..!
KCR : రాజకీయాల్లో ఎదురులేని కేసీఆర్..పిల్లల విషయంలో వెనకడుగు
ఇది కేవలం లేఖ వ్యహారంగా మాత్రమే కాక, బీఆర్ఎస్ లోని లోపలి విభేదాల ప్రతిబింబంగా మారింది. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కవిత రాజకీయంగా వెనుకబడడం, తనకు సొంత నియోజకవర్గం లేకపోవడం, ఇతర అంశాలన్నీ ఆమె అసంతృప్తికి కారణమయ్యాయి. ఇదే సమయంలో కేటీఆర్ ని బీఆర్ఎస్ నాయకత్వంగా ప్రాజెక్ట్ చేయడం, హరీశ్ రావు మద్దతు అనివార్యమవ్వడం పార్టీ అంతర్గత శక్తిసమతుల్యతను దెబ్బతీసింది. కవిత సానుభూతిని పెంచేందుకు లేదా పార్టీ లోపల చర్చను రెచ్చగొట్టేందుకు కేసీఆర్ లేఖను వ్యూహాత్మకంగా లీక్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం కేసీఆర్ పూర్వపు స్థిరమైన నాయకత్వ స్థానంలో కాక, మధ్యవర్తిగా మారాల్సిన దశకు చేరుకున్నారు. కుమారుడికి అధికారం అప్పగించాలంటే కుమార్తెకు రాజకీయ భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. హరీశ్ రావు పాత్ర కీలకమవ్వడంతో, ఆయన వైఖరిని బట్టి పార్టీ భవిష్యత్తు మారవచ్చు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు? బీఆర్ఎస్ లో నాయకత్వ సమస్య ఎలా పరిష్కరించబడుతుంది? అన్నదే తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది.