Congress : కాంగ్రెస్ పాలనలో చారిత్రిక బిల్లులకు అమోదం
ప్రధానాంశాలు:
Congress : కాంగ్రెస్ పాలనలో చారిత్రిక బిల్లులకు అమోదం
Congress : కాంగ్రెస్ పార్టీ Congress Party ఇచ్చిన అన్ని హమీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు. బుధవారం నాడు బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం వద్ద బోడుప్పల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోగుల నరసింహ రెడ్డి అధ్వర్యంలో బీసీబిల్లు,ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లకు చట్టబద్ధత కల్పించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిశేకం చేశారు.ఈ సందర్భంగా వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హమిని నెరవేర్చడానికి కృషి చేస్తుందని అన్నారు.

Congress : కాంగ్రెస్ పాలనలో చారిత్రిక బిల్లులకు అమోదం
Congress ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న రేవంత్ సర్కారు
కామారెడ్డి డిక్లరేషన్, చెవేళ్ల డిక్లరేషన్ లో భాగంగా బీసీ బిల్లుకు చట్టబద్దత,ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కు చట్టబద్దత కల్పించడంలో రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాపోలు రాములు బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ యాదవ్ గారు,
మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, బోడుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, కొత్త ప్రభాకర్ గౌడ్, విశ్వం గుప్త,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్,మాజీ కార్పొరేటర్లు, కంటెస్టెంట్ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు