Holi Festival : హోలీ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలి : జిల్లా ఎస్పి
ప్రధానాంశాలు:
Holi Festival : హోలీ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలి : జిల్లా ఎస్పి
Holi Festival : హోలీ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని, మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కావున జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో హోలీ వేడుకలు జరుపుకోవాలని సూచించారు.ముఖ్యంగా యువకులు అత్యుత్సాహం ప్రదర్శించరాదని ద్విచక్ర వాహనాలపై ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని,చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని మైనర్ డ్రైవింగ్ చేసే వారిని పట్టుకుని వారి తల్లిదండ్రులకు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Holi Festival : హోలీ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలి : జిల్లా ఎస్పి
Holi Festival ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు,మహిళల పట్ల మర్యాదగా ఉండాలి
హోలీ రోజున పోలీస్ సిబ్బంది ముమ్మరంగా పెట్రోలింగ్ , డ్రంక్ అండ్ టెస్ట్ లు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.హోలీ వేడుకలు ముగిసిన తరువాత స్నానాల కోసం అదిక నీటి ప్రవాహం, లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాల బారిన పడవద్దు అని సూచించారు.
పండుగ వేళ ఇతరులపై బలవంతంగా రంగులు వేయడం, గొడవలు పడినా, అసత్య ప్రచారం చేసినా, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, మహిళలను వేదింపులకు గురిచేసిన కఠిన చర్యలుతీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు.తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని ఎస్పి గారు విజ్ఞప్తి చేశారు.