Holi 2025 : మార్చి 14 హోలీ పండుగ,కొన్ని రాశుల వారికి గజకేసరి యోగం… అదృష్ట లక్ష్మి అనుగ్రహం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Holi 2025 : మార్చి 14 హోలీ పండుగ,కొన్ని రాశుల వారికి గజకేసరి యోగం… అదృష్ట లక్ష్మి అనుగ్రహం…?

 Authored By ramu | The Telugu News | Updated on :13 March 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Holi 2025 : మార్చి 14 హోలీ పండుగ,కొన్ని రాశుల వారికి గజకేసరి యోగం... అదృష్ట లక్ష్మి అనుగ్రహం...?

Holi 2025 : 2025 వ సంవత్సరంలో మార్చి 14న హోలీ పండుగ జరగనున్నది. అయితే ఈ పండుగ రోజు కొన్ని రాశుల వారికి అరుదైన గజకేసరి రాజయోగం ఏర్పడబోతుంది. దేవ గురువు బృహస్పతి, మనసుకు కారకుడైన చంద్రుడు కలిసి గజకేసరి రాజయోగాన్ని సృష్టించబోతున్నారు. శాస్త్రంలో గజకేసరి రాజయోగాన్ని అత్యంత శక్తివంతమైన యోగంగా పరిగణించబడింది. అయితే ఈ రాజయోగం కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు కేవలం హోలీ పండుగ రోజు మాత్రమే ప్రయోజనంగా పొందగలరు. మరి ఈ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం. ప్రతి ఏడాది కూడా పాల్గొనమాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగను ఎంతో వైభవంగా జరుపుకోవడం మనకి తెలిసిన విషయమే. ఈ సంవత్సరం హోలీ పండుగ మార్చి 14న జరుపుకుంటున్నారు. ఈసారి వచ్చే హోలీ పండుగ జ్యోతిష్య శాస్త్రంలో దృక్కోణంలో కూడా చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తున్నారు. ఈ హోలీ రోజునే చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం హోలీ నాడు ఏర్పడనుంది.

Holi 2025 మార్చి 14 హోలీ పండుగకొన్ని రాశుల వారికి గజకేసరి యోగం అదృష్ట లక్ష్మి అనుగ్రహం

Holi 2025 : మార్చి 14 హోలీ పండుగ,కొన్ని రాశుల వారికి గజకేసరి యోగం… అదృష్ట లక్ష్మి అనుగ్రహం…?

Holi 2025 బృహస్పతి, చంద్రుడు కలయికతో గజకేసరి రాజయోగం

ఈ గజకేసరి యోగం జ్యోతిష్య శాస్త్రంలోని అత్యంత శక్తివంతమైన యోగంగా పరిగణించబడినది. గజకేసరి రాజయోగంలో గురువు అయిన బృహస్పతి, మనసు కారకుడైన చంద్రుడు, ఇద్దరి కలయికతో గజకేసరి రాజయోగం ఏర్పడబోతుంది. ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఇటువంటి యోగం ఏర్పడుతుంది ,హోలీ రోజున చంద్రుడు వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ రాశిలో అప్పటికే బృహస్పతి సంచారం చేస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో వృషభ రాశిలో ఈ రెండిటి కలయిక జరుగుతుంది. దీన్నే గజకేసరి రాజయోగం అంటారు. ఈ యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని, ఆర్థిక లాభాలను కూడా పొందుతారు. హోలీ నాడు అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం….

మిధున రాశి : హోలీ రోజున ఈ మిధున రాశి వారికి గజకేసరి రాజయోగం శుభప్రదంగా ఉండబోతుంది. మిధున రాశి వారికి 12వ ఇంట్లో ఈ రాజయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలోనే మిధున రాశి వారు డబ్బుని పొదుపు చేసే విషయంలో విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో మిధున రాశి వారికి ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆస్తి లావాదేవీల విషయాలలో లాభం కలుగుతుంది.

సింహరాశి : సింహ రాశి వారికి గజకేసరి రాజయోగం ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఈ గజకేసరి యోగం సింహ రాశి వారికి పదవ ఇంట్లో ఏర్పడుతుంది. ఈ సమయంలో, సింహ రాశి వారికి ఆర్థిక పరిస్థితుల్లో ఒక కొలిక్కి వస్తాయి. పదాలు చేసే వారికి కూడా అనుకూలమైన సమయం. వ్యాపారాలలో లాభాలను చవిచూస్తారు. వ్యాపారాలని మరింత విస్తరింపజేయుటకు ప్రాణాలిక పై పని చేయవచ్చు. చేసే వారికి పదోన్నతులు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి.

మకర రాశి : ఈ మకర రాశి వారికి హోలీ రోజున గజకేసరి రాజయోగం అనుకూలంగా మారబోతుంది. యోగం మకర రాశిలో ఐదవ ఇంట్లో ఏర్పడుతుంది. కావున ఈ సమయంలో ఈ రాశి వారికి ఆకస్మికంగా ధనయోగం కలుగుతుంది. అధిక పరిస్థితుల్లో గతంలో కంటే కూడా మెరుగుపడి ఉండవచ్చు. రాస్తులును కొనుటకు పెట్టుబడులు పెట్టవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది