Holi Festival : హోళీ పండుగ ప్రాశస్త్యం ఏంటి… అసలు అది ఎలా మొదలైంది?
Holi Festival : హోళీ పండుగని Holi Festival ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారనే విషయం మనందరికి తెలిసిందే. ఆ పండుగ వచ్చిందంటే చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా ఒక దగ్గరకు చేరి రంగులు రాసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. హోలీ పండుగ Holi Festival వస్తుందంటే ముందు రోజు రాత్రి నుంచి వీధుల్లో భోగి మంటలను తలపించేలా కర్రల పోగులు కనిపిస్తుంటాయి. శివాలయాలు ఉండే చోట తప్పనిసరిగా ఇలాంటి కర్ర పోగులు కనిపిస్తాయి.
Holi Festival : ఇది అసలు కథ..
చరిత్రకారులు హోలీని ఆర్యులు జరుపుకున్నారని విశ్వసిస్తున్నారు.చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు.ఈ పండుగ వసంత ఋతువుకు స్వాగతం పలుకుతుంది.ఈ పండుగ ప్రజల మధ్య ప్రేమ, స్నేహాలను పెంపొందిస్తుంది.హోలీ పండుగ వెనుక అనేక పురాణ కథలు ఉన్నాయి. ప్రహ్లాదుని కథ ముఖ్యంగా చెబుతారు.. హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక ప్రహ్లాదుని మంటల్లో దహనం చేయాలని ప్రయత్నించగా, విష్ణువు కృపతో ప్రహ్లాదుడు రక్షింపబడ్డాడు.

Holi Festival : హోళీ పండుగ ప్రాశస్త్యం ఏంటి… అసలు అది ఎలా మొదలైంది?
హోలిక దహనం చెందింది కాబట్టి దానికి గుర్తుగా Holi Festival హోలీ పండుగను జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు Lord Krishna తన బాల్యంలో గోపికలతో కలిసి రంగులు చల్లుకుంటూ హోలీ Holi ఆడినట్లు పురాణాలు చెబుతున్నాయి. హోలీ పండుగ ఒక్క భారతదేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్ వంటి ఇతర దేశాలలో కూడా జరుపుకుంటారు. హోలికి ముందురోజు రాత్రి కామ దహనం కార్యక్రమం తర్వాత రంగులు చల్లుకుంటూ పండుగ జరుపుకుంటారు. హోలీని ఫాల్గుణ పూర్ణిమ, కాముని పున్నమి, కామదహనం, ఫాల్గుణోత్సవం అని కూడా పిలుస్తారు.