Viral Video : గన్‌మెన్‌పై హోంమంత్రి మహమూద్ అలీ ప్రతాపం.. చెంపచెళ్లుమనిపించాడు.. వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : గన్‌మెన్‌పై హోంమంత్రి మహమూద్ అలీ ప్రతాపం.. చెంపచెళ్లుమనిపించాడు.. వీడియో వైరల్

 Authored By kranthi | The Telugu News | Updated on :6 October 2023,3:30 pm

Viral Video : రాజకీయ నాయకులు తమ కన్నా చోటా మోటా నాయకులను కొట్టడం సహజమే. తమతో పాటు తిరిగే గన్ మెన్స్ ను, కార్యకర్తలను కూడా కోపం వస్తే కొడతారు. ఇటీవల మంత్రి తలసాని ఓ నేతను వెనక్కి లాగి మరీ చెంప మీద కొట్టిన వీడియోను చూశాం కదా. తాజాగా హోంమంత్రి మహమూద్ అలీ గన్ మెన్ పై తన ప్రతాపాన్ని చూపించారు. గన్ మెన్ చెంప చెళ్లుమనిపించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇవాళ మంత్రి తలసాని పుట్టినరోజు. ఈ సందర్భంగా తలసానికి కలిసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అలీ. తలసానిని కౌగిలించుకొని శుభాకాంక్షలు తెలిపాక.. ఫ్లవర్ బొకే ఎక్కడ అని తన పక్కనే ఉన్న గన్ మెన్ ను అడిగారు మహమూద్ అలీ.

దీంతో తీసుకొస్తున్నాం అని చెబుతుండగానే గన్ మెన్ చెంప చెళ్లుమనిపించాడు. చేతుల్లో పట్టుకొని ఉండాలి కదా.. ఎందుకు తీసుకురాలేదు అన్నట్టుగా గన్ మెన్ పై ఆగ్రహం వ్యక్తి చేస్తూ గన్ మెన్ ను చెంప మీద కొట్టాడు మహమూద్ అలీ. ఆయన చేసిన పని చూసి అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. అదేంటి మహమూద్ అలీ అంతలా ఆవేశపడ్డారు అని అనుకున్నారు. ఇంతలో గన్ మెన్ పక్కనే ఉన్న బోకేనె తీసి హోంమంత్రికి అందించాడు. దీంతో దాన్ని తీసుకొని తలసానికి ఇచ్చారు హోంమంత్రి మహమూద్ అలీ.

Viral Video : మహమూద్ అలీపై జనాల ఆగ్రహం

తన గన్ మెన్ పై ప్రతాపం చూపించిన హోం మంత్రి మహమూద్ అలీ వీడియోను చూసి నెటిజన్లు, జనాలు మండిపడుతున్నారు. తనకు సెక్యూరిటీగా ఉన్న వ్యక్తిపై చేయి చేసుకోవడం ఏంటి. ఎంత మంత్రి అయితే మాత్రం సిబ్బంది అంటే అంత చులకనా? తన కోసం రాత్రింబవళ్లు కష్టపడుతూ ఆయన్ను కంటికి రెప్పలా కాపాడుతున్న సిబ్బందితో ఇలాగేనా ప్రవర్తించేది అని మహమూద్ అలీపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది