mayor vijayalakshmi : పాపం మేయర్ విజయలక్ష్మి మేడం పదవి ఎక్కడమే ఆలస్యం పరాభవం
mayor vijayalakshmi : జీహెచ్‌ఎంసీ మేయర్ పీఠంపై ఇటీవలే టీఆర్‌ఎస్‌కు చెందిన గద్వాల విజయలక్ష్మి గారు కూర్చున్న విషయం తెల్సిందే. ఆమె బాధ్యతలు తీసుకున్న సమయంలో వరదలు రావద్దంటే వర్షాలు కురవద్దంటూ చేసిన వ్యాఖ్యలు ట్రోల్ అయ్యాయి. మేయర్ గా విజయలక్ష్మి కనీస అవగాహణ లేకుండా మాట్లాడారు అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఉండటం వల్ల మేయర్ అయ్యారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన వారు ఇంత కంటే గొప్పగా మాట్లాడుతారా అంటూ ట్రోల్స్ వచ్చాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే విజయలక్ష్మి కి మరో చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె పదవి బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే హైదరాబాద్ ను కేంద్రం చెత్త నగరాల జాబితాలో చేర్చడం తో ఆమె కు పరాభవం తప్పలేదు.
mayor vijayalakshmi : హైదరాబాద్ కు 24వ ర్యాంక్..
కేంద్ర ప్రభుత్వం దేశంలో నివాస యోగ్యం అయిన నగరాల జాబితాను విడుదల చేయగా అందులో 24వ స్థానంను హైదరాబాద్ దక్కించుకుంది. దేశంలోనే పేరు పొందిన నగరం అయిన హైదరాబాద్ కు కేంద్రం ఈ స్థానంను కట్టబెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం అవుతుంది. రాజకీయ దురుద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కు ఇలా తప్పుడు ర్యాంక్ ను ఇచ్చిందని హైదరాబాద్ వాసులు అంటున్నారు. టీఆర్‌ఎస్ నాయకులు కూడా హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ నాయకులు హైదరాబాద్ పై పట్టు సాధించేందుకు ఇలాంటి తప్పుడు ర్యాంకులు ఇస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మేయర్ విజయలక్ష్మి కి చెడ్డ పేరు..
కేంద్రం విడుదల చేసిన జాబితాలో హైదరాబాద్ 55.4 స్కోర్ తో 24వ ర్యాంక్ ను దక్కించుకోవడం పట్ల మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నగర ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఈ ర్యాంకింగ్ ఉందని హైదరాబాద్ నివాస యోగ్యం కాదంటూ కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్ ను ప్రజలు నమ్మకూడదు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయి నగరాలతో పోల్చిన సమయంలో హైదరాబాద్ కు 24వ ర్యాంక్ వచ్చింది. మేయర్ గా విజయలక్ష్మి పదవి బాధ్యతలు తీసుకున్న వెంటనే ఇలాంటి ర్యాంకు రావడం సోచనీయం అంటూ హైదరాబాద్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.