Telangana : ఎండల నుండి కాస్త ఉపశమనం.. అప్పటి నుండి తెలంగాణలో వర్షాలు..!
ప్రధానాంశాలు:
Telangana : ఎండల నుండి కాస్త ఉపశమనం.. అప్పటి నుండి తెలంగాణలో వర్షాలు..!
Telangana : తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. మాడు పగిలే ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి భగభగలతో బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ఏడాది జనవరి చివరి వారం నుంచే భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు.

Telangana : ఎండల నుండి కాస్త ఉపశమనం.. అప్పటి నుండి తెలంగాణలో వర్షాలు..!
Telangana చల్లని వార్త..
ఉదయం 9 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 10 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రోడ్లపై జన సంచారం తగ్గిపోతుంది. రాత్రి వేళల్లోనూ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. దీనికి తోడు వడగాలులు కూడా తోడవడంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
బటయకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.ఇలాంటి సమయంలో హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. ఎండల నుంచి ఉపశమనం కలిగేలా చల్లని వార్త చెప్పింది. రాష్ట్రంలో ఈనెల 21 నుంచి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈనెల 21 నుంచి 25 వరకు రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు.