Rythu Bharosa : మీకు రైతు భరోసా నిధులు జమ కాలేదా?… అయితే ఈ పని చేయండి?.. ఏం చేయాలంటే..?

Authored By Sudheer Ramanujam | The Telugu News | Updated on : 24 March 2026, 11:15 am
  •   Rythu Bharosa : మీకు రైతు భరోసా నిధులు జమ కాలేదా?... అయితే ఈ పని చేయండి?.. ఏం చేయాలంటే..?

Rythu Bharosa : తెలంగాణ  ప్రభుత్వం telangana government  రైతులకు farmars ఆర్థిక భరోసా కల్పించే దిశగా రైతు భరోసా పథకం Rythu Bharosa Funds నిధులను విడుదల చేసింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న రైతులకు ఈ నిర్ణయం ఊరటను కలిగించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి CM Revanth reddy  ఈ నిధులను అధికారికంగా విడుదల చేస్తూ అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో దశల వారీగా డబ్బులు జమ అవుతాయని ప్రకటించారు. మొదటి విడతలో ప్రతి రైతుకు ఒక ఎకరానికి రూ.6,000 చొప్పున జమ చేయగా మిగతా ఎకరాలకు సంబంధించిన మొత్తాన్ని రెండో, మూడో విడతల్లో చెల్లించనున్నట్లు తెలిపారు.

Rythu Bharosa : మీకు రైతు భరోసా నిధులు జమ కాలేదా?... అయితే ఈ పని చేయండి?.. ఏం చేయాలంటే..?

Rythu Bharosa : మీకు రైతు భరోసా నిధులు జమ కాలేదా?… అయితే ఈ పని చేయండి?.. ఏం చేయాలంటే..?

Rythu Bharosa : తొలి విడత జమ .. బ్యాంక్ సెలవుల ప్రభావం

ప్రభుత్వం నిధులను విడుదల చేసినప్పటికీ ఆదివారం బ్యాంకులకు సెలవు ఉండటంతో రైతుల ఖాతాల్లో నగదు సోమవారం నుంచే జమ అవుతోంది. దీనితో కొంతమంది రైతులు తమ ఖాతాల్లో డబ్బులు ఇంకా జమ కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంకింగ్ ప్రక్రియ పూర్తవగానే మొత్తాలు ఖాతాల్లో ప్రతిబింబిస్తాయని స్పష్టం చేస్తున్నారు.

Rythu Bharosa : నిధులు రాని రైతులకు సూచనలు

తొలి విడతలో డబ్బులు జమ కాని రైతులు కొన్ని ముఖ్యమైన విషయాలను పరిశీలించుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ముందుగా తమ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో ధృవీకరించుకోవాలి. అలాగే బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ అయి ఉందా, కేవైసీ ప్రక్రియ పూర్తి అయ్యిందా అనే అంశాలను పరిశీలించాలి. అదనంగా ధరణి పోర్టల్‌లో పాస్‌బుక్ వివరాలు సరిగ్గా నమోదయ్యాయా లేదా అన్నది కూడా చెక్ చేయాలి. ఈ వివరాలు సక్రమంగా ఉంటేనే నిధులు ఖాతాలో జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. సమస్యలు ఉంటే స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి లేదా మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

Rythu Bharosa : దరఖాస్తు, రిజిస్ట్రేషన్ ప్రాముఖ్యత

ఇకపోతే కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులు సమయానికి రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవడం అత్యంత కీలకం. గడువు దాటితే నిధులు అందకపోవచ్చని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అలాగే ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు నమోదు తప్పనిసరి చేయడంతో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఏదైనా సాంకేతిక సమస్యల వల్ల డబ్బులు జమ కాకపోతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం మొదటి ఎకరానికి రూ.6,000 చొప్పున అందజేస్తుండగా ఎన్ని ఎకరాలు ఉన్నా మిగతా మొత్తాన్ని తరువాతి విడతల్లో పూర్తిగా జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకం ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రైతు భరోసా నిధులు అందని వారు తప్పనిసరిగా అధికారులను సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది.

 

Advertisement

Sudheer Ramanujam

Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి