Telangana Elections 2023 : తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం.. బీఆర్ఎస్‌కి షాకిచ్చిన జాతీయ సర్వే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Telangana Elections 2023 : తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం.. బీఆర్ఎస్‌కి షాకిచ్చిన జాతీయ సర్వే?

Telangana Elections 2023 : తెలంగాణలో ఇంకో రెండు మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకే కదా.. ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను బరిలోకి దింపింది బీఆర్ఎస్. 119 నియోజకవర్గాలకు గాను 115 నియోజకవర్గాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి సరికొత్త ఒరవడికి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. ఇదంతా పక్కన పెడితే అసలు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :26 August 2023,9:00 pm

Telangana Elections 2023 : తెలంగాణలో ఇంకో రెండు మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకే కదా.. ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను బరిలోకి దింపింది బీఆర్ఎస్. 119 నియోజకవర్గాలకు గాను 115 నియోజకవర్గాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి సరికొత్త ఒరవడికి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. ఇదంతా పక్కన పెడితే అసలు బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందా? అంటే ఈసారి బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ కు అధికారం వచ్చే చాన్స్ ఉందని ఓ జాతీయ సర్వే తేల్చేసింది.

ఇండియా టుడే జాతీయ వ్యాప్తంగా చేసిన సర్వే ప్రకారం చూస్తే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండియా టుడే తాజాగా సర్వే చేయగా.. దాంట్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కే ఓటర్లు ఎక్కువ మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వేలో ఈ షాకింగ్ ఫలితాలు వెల్లడైనట్టు తెలుస్తోంది. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో ఉన్న 17 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ స్థానాలు తగ్గి.. కాంగ్రెస్ స్థానాలు పెరుగుతాయని తేల్చింది. బీజేపీ సీట్లలో మాత్రం పెద్ద తేడా ఉండదని తేల్చింది.లోక్ సభ స్థానాల కోసం ఈ సర్వే నిర్వహించినా.. ఇవే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అసలే మూడో సారి అధికారం కోసం బీఆర్ఎస్ తెగ ప్రయత్నాలు చేస్తోంది.

telangana congress may win according to survey

telangana congress may win according to survey

Telangana Elections 2023 : అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు

కానీ.. అనూహ్యంగా తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు తెలియడంతో బీఆర్ఎస్ కూడా అలర్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా తామే అని అనుకుంటున్న బీజేపీకి కూడా ఈ ఎన్నికలు షాక్ ఇవ్వనున్నాయి. మొత్తానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కొంచెం కష్టపడి సరైన అభ్యర్థులను నిలబెట్టి ప్రాపర్ గా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వచ్చినట్టే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది