Droupadi Murmu : నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము
Droupadi Murmu : ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనం-2024 గురువారం ప్రారంభమైంది కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ, హార్ట్‌ఫుల్‌నెస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సమ్మేళనానికి భారత్ సహా వందకుపైగా దేశాల నుంచి 300 మంది ప్రఖ్యాత సర్వమత గురువులు తరలివచ్చారు. తొలిరోజు ప్రఖ్యాత శంకర్ మహాదేవన్, కుమరేష్ రాజగోపాలన్, శశాంక్ సుబ్రమణ్యం నేతృత్వంలో సంగీత కచేరితో ప్రారంభమైంది రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని కన్హా శాంతి వనం వేదికగా ఈ సమ్మేళనం నిర్వహస్తున్నారు. రెండోరోజు శుక్రవారం ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు. రాష్ట్రపతి తన సందేశాన్ని ఇస్తారు. 16న 3వరోజు శనివారం ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ విశిష్ట అతిధిగా హాజరవుతారు.
17న ప్రపంచ ఆధ్యాత్మిక గురువుల కొన్ని సెషన్లు ఉంటాయి. ప్రపంచ శాంతి రోజువారీ జీవితంలో ఆధ్యాత్మికతతో పాటు ప్రఖ్యాత సర్వమత గురువుల సంభాషణలు ఉంటాయి. ఇన్నర్ పీస్‌టు వరల్డ్ పీస్ అనేది మన దైనందిన అస్తిత్వంలో వివిధ రంగాల్లో మనమందరం పోరాడుతున్న అనేక స్థాయిల సంఘర్షణలు దృష్టిలో ఉంచుతుంది. దీర్ఘకాలిక ప్రపంచ శాంతి అవసరం ఉందన్నది సమ్మేళనం ధీమ్ కావడం ప్రత్యేకత సంతరించుకుంది. గత ఏడాది భారతదేశం ఆధ్వర్యంలో జరిగిన జీ20 సమావేశాల కోసం ఎంచుకున్న థీమ్ ‘వసుధైవ కుటుంబకం’ వన్ వరల్డ్ ్ఖవన్ ఫ్యామిలీ. ఈ థీమ్ జీ20లో పాల్గొన్న సభ్యదేశాలు, ప్రత్యేక ఆహ్వానిత దేశాలతోపాటు యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది.
ఈ గ్లోబల్ స్పిరిచువల్ మహూత్సవ్ లక్ష్యం కూడా ఇదే. ఐకమత్య భావన పెంపొందించడం, సకలజన సమ భావన ప్రోత్సహంచడం. ఆధ్యాత్మిక భావన ముందుకు తీసుకెళుతూ ‘వసుధైవ కుటుంబంకం’ ఆలోచన ప్రతి వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లాలనే సందేశం ప్రపంచానికి పంపాలనేది లక్ష్యంగా నిర్ణయించారు. దేశంలో తొలిసారి ఇంత ఉత్సా#హంగా ప్రపంచ నలుమూలల నుంచివస్తున్న ఆధ్యాత్మిక గురువులు వారి మతాల సారం, అనుభవాలు, ఆధ్యాత్మిక, తాత్వికమైన ఆలోచనలు ఈ వేదిక ద్వారా పంచుకోనున్నారు.