Indiramma House : పేదలకి ఇందిరమ్మ ఇండ్లు.. అలా నిర్మిస్తేనే బిల్లులు..!
Indiramma House : తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం మనందరికి తెలిసిందే. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. సొంత స్థలం కలిగిన పేదవారు 400 నుండి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో తమకు నచ్చిన విధంగా ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం ఐదు విడతల్లో మొత్తం రూ. ఐదు లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది.

Indiramma House : పేదలకి ఇందిరమ్మ ఇండ్లు.. అలా నిర్మిస్తేనే బిల్లులు..!
Indiramma House ఇలా చేస్తేనే..
అయితే కొందరు లబ్ధిదారులు అవగాహన లోపంతో 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. దీంతో వారికి పునాది దశలో విడుదల చేయాల్సిన మొదటి విడత రూ. లక్ష బిల్లును అధికారులు నిలిపేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిని అనర్హులుగా పరిగణించి చెల్లింపులు నిలిపివేయడంతో లబ్ధిదారులు ఆందోళన చెందారు. తమకు నిబంధనల గురించి తెలియక పొరపాటు జరిగిందని.. తెలిస్తే 600 చదరపు అడుగులలోపే నిర్మాణం చేపట్టేవారమని వారు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.
ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్లను కచ్చితంగా 400-600 చదరపు అడుగుల మధ్యలోనే నిర్మించాలని తెలిపారు. ప్రభుత్వం అందించే రూ. 5 లక్షలతోనే నిర్మాణం పూర్తయ్యేలా ప్రతి మండలంలో నమూనా ఇళ్లు నిర్మించారని గతంలో 650 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్లు నిర్మించినట్లు వివరించారు. ఇప్పుడు 600 చదరపు అడుగుల వరకు ఇళ్లు నిర్మించుకునేందుకు అవకాశం ఇస్తున్నామన్నారు. ఇందులో ఇల్లు విశాలంగా ఉంటుందన్నారు మొదటి విడతలో 370 మంది లబ్దిదారులు 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో పునాది వేసుకున్నారని..వీరికి మరో ఛాన్స్ ఇస్తున్నామన్నారు. 600 చదరపు అడుగులకు కుదించుకుని శ్లాబు వేసుకుంటే బిల్లులు మంజూరు చేస్తున్నామని చెప్పారు.