TRS : టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే.. తెలంగాణ జనాలనే వాళ్లు పిచ్చోళ్లను చేస్తున్నారు.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ ?
TRS : తెలంగాణ అధికార పార్టీ టీఆర్‌ఎస్.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీలు రెండు కూడా అన్నదమ్ముల పార్టీలు అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి విమర్శలు చేశాడు. పైకి చూడ రెండు పార్టీల నాయకులు గొడవలు పడుతున్నా కూడా తెర వెనుక మాత్రం రెండు పార్టీల మద్య స్నేహం అనుబంధం కొనసాగుతున్నాయి అంటూ ఆయన ఆరోపించారు. టీఆర్‌ఎస్ పార్టీకి బీజేపీ అన్ని విషయాల్లో మద్దతుగా ఉంటుందని అందుకే కేసీఆర్ హడావుడి ఢిల్లీ పర్యటనలు అన్నాడు. టీఆర్‌ఎస్ కు ఎంఐఎం మరియు బీజేపీలు రెండు కూడా చాలా సన్నిహితంగా ఉండే పార్టీలు. కనుక వారిని నమ్మకూడదు అంటూ జగ్గారెడ్డి అన్నాడు.
పగలంతా కొట్టుకుంటారు, రాత్రి కూర్చుని మాట్లాడుకుంటారు: TRS
టీఆర్‌ఎస్ మరియు బీజేపీ పార్టీ నాయకులు అన్నదమ్ముల పిల్లల మాదిరిగా పగలు అంతా కూడా కొట్టుకుంటారు. జనాలను పగలంతా కూడా పరేషాన్ చేసి హడావుడి చేస్తారు. కాని రాత్రి అయ్యే సమయానికి అంతా ఒక్క చోట చేరి మాట్లాడుకుంటారు. ఇప్పుడు టీఆర్‌ఎస్ మరియు బీజేపీ పార్టీల పరిస్థితి అలాగే ఉంది అంటూ జగ్గారెడ్డి ఆరోపించాడు. పాలెల్లో మాదిరిగా వారిద్దరు ఉన్నారు. బయటి వారిని రాకుండా వారిలో వారే కొట్టుకుంటున్నట్లుగా డ్రామాలు ఆడుతున్నారు. అంతే తప్ప వారి మద్య నిజమైన విభేదాలు లేవు. రాజకీయ ప్రయోజనాల కోసం కొట్టుకోవడం ఆ వెంటనే కలిసి పోయినట్లుగా కలరింగ్ ఇవ్వడం వారికి అలవాటు అయ్యింది. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలంటూ జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశాడు.
బండి సంజయ్ అవి ఎందుకు మాట్లాడడు
కేసీఆర్ పై యుద్దం చేస్తా అంటూ ఇష్టానుసారంగా మాట్లాడే జగ్గారెడ్డి ఎందుకు ఆయన ముందు అసలు విషయాలను మాట్లాడడు. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను ఎంత వరకు నెరవేర్చారు అనే విషయాన్ని ఇప్పటి వరకు బండి సంజయ్ ప్రశ్నించాడా. కేసీఆర్ అంటే ఆయనకు భయం. తమ పార్టీ సీనియర్ నాయకులతో ఉన్న సన్నిహిత్యంతో నాపై ఎక్కడ విరుచుకు పడుతాడో అంటూ చాలా భయంతో బండి సంజయ్ నోరు మూసుకుని ఉంటున్నాడు. అలాగే కేంద్రం కూడా రాష్ట్రంకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా నాన్చుతుంటే ఎందుకు కేసీఆర్ నోరు మొదపడం లేదు అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించాడు. వీరి డ్రామాలకు జనాలు మోసపోకుండా ఉండాలని జగ్గారెడ్డి పేర్కొన్నాడు.