Kavitha : సిద్దిపేట ఎమ్మెల్యేగా కవిత… ఏం జరుగుతుంది..?
ప్రధానాంశాలు:
Kavitha : సిద్దిపేట ఎమ్మెల్యేగా కవిత... ఏం జరుగుతుంది..?
Kavitha : ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. రాజకీయ పరిణామాలపై తరచూ స్పందిస్తూ, కొత్త కొత్త వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణాన్ని మరింత రసవత్తరంగా మారుస్తున్నారు కవిత. ఈ క్రమంలోనే తాజాగా ఆమెకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అదేంటంటే… రాబోయే ఎన్నికల్లో కవిత సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం. ఇప్పటివరకు సిద్ధిపేటను కేసీఆర్, ఆ తర్వాత ఆయన అల్లుడు హరీష్ రావు మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. కేసీఆర్ ఈ నియోజకవర్గాన్ని హరీష్ రావుకు అప్పగించిన తర్వాత, ఆయన వరుస విజయాలు సాధిస్తూ సిద్ధిపేటను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించారు.
Kavitha : సిద్దిపేట ఎమ్మెల్యేగా కవిత… ఏం జరుగుతుంది..?
Kavitha : నిజమెంత ?
ఇలాంటి కంచుకోటగా పేరొందిన నియోజకవర్గంలో కవిత పోటీ చేయాలనుకుంటున్నారన్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ రాజకీయాల్లో తనకు ప్రత్యేక గుర్తింపు రావాలంటే హరీష్ రావును ఓడించాల్సిందే అన్న భావనతోనే ఆమె సిద్ధిపేటపై దృష్టి పెట్టారని కొందరు అంటున్నారు. అంతేకాదు, తన తండ్రి వదిలిన నియోజకవర్గాన్ని తిరిగి తన చేతుల్లోకి తీసుకోవాలన్న ఆశతో, హరీష్ రావును అక్కడ ఓడించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా వినిపిస్తోంది.ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Harish Rao : సిద్దిపేట ఎమ్మెల్యేగా కవిత… ఏం జరుగుతుంది..?
కొంతమంది “20 ఏళ్లుగా సిద్ధిపేటను అభివృద్ధి చేసిన హరీష్ రావును ఓడించడం కవిత వల్ల కాదు. అక్కడి ప్రజలు ఆయనను దేవుడిలా చూస్తారు” అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, “కవిత నిజంగానే సిద్ధిపేటలో పోటీ చేస్తే రాజకీయంగా ఆసక్తికరమైన పోరు చూడొచ్చు” అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి, కవిత రాబోయే ఎన్నికల వరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది, ఆమె నిజంగానే సిద్ధిపేట నుంచి బరిలో దిగుతారా లేదా అన్నది ముందున్న రోజుల్లో తేలాల్సి ఉంది. అప్పటివరకు ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తూనే ఉండే అవకాశం కనిపిస్తోంది.