KCR And Ys Jagan : కేసీఆర్, జగన్ ఇద్దరు మాజీ సీఎంలు ఒకేసారి యాక్టీవ్.. ఏమైఉంటుందబ్బా?
ప్రధానాంశాలు:
KCR And Ys Jagan : కేసీఆర్, జగన్ ఇద్దరు మాజీ సీఎంలు ఒకేసారి యాక్టీవ్.. ఏమైఉంటుందబ్బా?
KCR And Ys Jagan : తెలంగాణ telangana, ఆంధ్రప్రదేశ్ andhra pradesh రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అలెర్ట్ అయ్యాయి. ప్రజా సమస్యలు, రైతు సమస్యలపై విపక్ష నేతలు అధికార ప్రభుత్వాలను నిలదీస్తూ బయటకు రావడం ప్రారంభించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికారం కోల్పోయినప్పటి నుంచి కేసీఆర్ పెద్దగా యాక్టివ్ గా లేరు. వ్యవసాయ క్షేత్రానికే పరిమితమయ్యారు. సుమారు 14 నెలల అనంతరం ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చి సమీక్షలు మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో సైతం వైఎస్ జగన్ Jagan విదేశీ, కర్ణాటక పర్యటనలు ముగించుకుని ఇటీవలే ఏపీకి తిరిగివచ్చి జనం బాట పట్టారు. పార్టీ నేతలకు పరామర్శతో పాటు గుంటూరు మిర్చి యార్డు రైతుల వ్యథలు విని పరామర్శించారు.

KCR And Ys Jagan : కేసీఆర్, జగన్ ఇద్దరు మాజీ సీఎంలు ఒకేసారి యాక్టీవ్.. ఏమైఉంటుందబ్బా?
KCR And Ys Jagan వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత కేసీఆర్ KCR ఫామ్ హౌజ్‌కు పరిమితమయ్యారు. కనీసం అసెంబ్ల సమావేశాలకు కూడా హాజరు రావడం లేదు. కాగా 14 నెలల అనంతరం తాజాగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు, ప్రభుత్వ వైఫల్యాలతో ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పార్టీ నాయకులు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
పార్టీ నేతలకు పరామర్శ, రైతులకు భరోసాతో జగన్ ముందుకు
ఏపీలో జగన్మోహన్ రెడ్డి Jagan Mohan Reddy సైతం అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అవుతున్నారు. ఇటీవలే మళ్లీ యాక్టీవ్ అయ్యారు. అరెస్ట్ అయిన పార్టీ నేతలను జైలుకు వెళ్లి పరామర్శిస్తున్నారు. పార్టీ నేతలపై జరుగుతున్న దాడులను, కేసులను ప్రశ్నిస్తున్నారు. తమ అధినేత ప్రజా క్షేత్రంలోకి రాగానే ఒక్కసారిగా వైసీపీ వర్గాలు యాక్టీవ్ అయ్యాయి. మొత్తంమీద ఒకేసారి ఇద్దరు మాజీ సీఎంలు క్రియాశీలకం కావడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది.