Etela Rajender : ఈటల రాజేందర్‌కు కేసీఆర్ ఫోన్ .. సోషల్ మీడియా వార్తలపై స్పందించిన ఈటెల..!
ప్రధానాంశాలు:
Etela Rajender : ఈటల రాజేందర్‌కు కేసీఆర్ ఫోన్ !
Etela Rajender : తనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ KCR Phone ఫోన్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై మల్కాజిగిరి BJP MP బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. KCR కేసీఆర్ తనకు ఫోన్ చేసి మళ్లీ కలిసి పనిచేయాలని పిలిచారన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను ఆయన కోరారు.మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు ఫోన్ చేశారని.. మళ్లీ కలిసి పని చేయాలని పిలిచారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై ఈటల రాజేందర్ స్పందిస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఈటల తీవ్రంగా ఖండించారు. తానంటే గిట్టని వారు, సోషల్ మీడియాలో ఉండే కొందరు సైకోలు, శాడిస్టులు మాత్రమే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఈటల ఘాటుగా స్పందించారు.
![Etela Rajender ఈటల రాజేందర్‌కు కేసీఆర్ ఫోన్ సోషల్ మీడియా వార్తలపై స్పందించిన ఈటెల](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Etela-Rajender.jpg)
Etela Rajender : ఈటల రాజేందర్‌కు కేసీఆర్ ఫోన్ .. సోషల్ మీడియా వార్తలపై స్పందించిన ఈటెల..!
తాను చాలా కాలంగా brs బీఆర్ఎస్, కేసీఆర్ విషయంలో తన స్పష్టమైన అభిప్రాయాన్ని చెబుతూనే ఉన్నప్పటికీ.. కొంతమంది కావాలనే పనిగట్టుకుని మరీ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవారిపైనే త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటనని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
Etela Rajender కేసీఆర్ మళ్లీ పిలిస్తే వెళ్తారా?
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈటల రాజేందర్.. కీలక విషయాలు వెల్లడించారు. కేసీఆర్ మళ్లీ పిలిస్తే వెళ్తారా అంటూ.. జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఈటల తనదైన శైలిలో స్పందించారు. తామంతా బాధ్యత ఉన్న రాజకీయ నేతలుగా చెప్పుకొచ్చిన ఈటల.. ఇదేమీ పిల్లల ఆట కాదన్నారు. వాళ్ల పార్టీ వాళ్లది, తమ పార్టీ తమదని చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావటమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రోజులో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో సరైన సమాచారం లేదన్న ఆయన ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ జరిపిన కులగణనలో కూడా శాస్త్రీయత లేదంటూ విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీసీ-ఈ గ్రూప్ తీసుకొచ్చారన్నది తప్పుడు వాదన అని.. నిజానికి అంతకుముందే కొన్ని ముస్లిం కులాలు బీసీ-బీ గ్రూప్‌లో ఉన్నాయని ఈటల వివరించారు.