Virat Kohli : ఐపిఎల్‌ రికార్డు బద్దలు.. విరాట్ కోహ్లీ 8వ‌ సెంచ‌రీ.. రాజ‌స్తాన్ టార్గెట్ 184 ..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Virat Kohli : ఐపిఎల్‌ రికార్డు బద్దలు.. విరాట్ కోహ్లీ 8వ‌ సెంచ‌రీ.. రాజ‌స్తాన్ టార్గెట్ 184 ..!

Virat Kohli : ఐపీఎల్ సీజ‌న్ 17లో భాగంగా ఈ రోజు రాజ‌స్థాన్, ఆర్సీబీ మ‌ధ్య ట‌ఫ్ మ్యాచ్ కొన‌సాగుతుంది. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న రాజస్థాన్ సొంతమైదానంలో మరో గెలుపును అందుకోవాలని ఉవ్విళ్లూరుతుండ‌గా, ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రిస్తున్న ఆర్సీబీకి కూడా విజ‌యం కోసం త‌పిస్తుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేస్తుండ‌గా, ఓపెన‌ర్‌గా వ‌చ్చిన విరాట్ కోహ్లీ చ‌రిత్ర సృష్టించాడు. 72బంతులు ఆడిన విరాట్ కోహ్లీ 113 ప‌రుగులు చేశారు. మొత్తం మీద ఐపీఎల్‌లో […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 April 2024,9:19 pm

ప్రధానాంశాలు:

  •  Virat Kohli : ఐపిఎల్‌ రికార్డు బద్దలు.. విరాట్ కోహ్లీ 8వ‌ సెంచ‌రీ.. రాజ‌స్తాన్ టార్గెట్ 184 ..!

Virat Kohli : ఐపీఎల్ సీజ‌న్ 17లో భాగంగా ఈ రోజు రాజ‌స్థాన్, ఆర్సీబీ మ‌ధ్య ట‌ఫ్ మ్యాచ్ కొన‌సాగుతుంది. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న రాజస్థాన్ సొంతమైదానంలో మరో గెలుపును అందుకోవాలని ఉవ్విళ్లూరుతుండ‌గా, ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రిస్తున్న ఆర్సీబీకి కూడా విజ‌యం కోసం త‌పిస్తుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేస్తుండ‌గా, ఓపెన‌ర్‌గా వ‌చ్చిన విరాట్ కోహ్లీ చ‌రిత్ర సృష్టించాడు. 72బంతులు ఆడిన విరాట్ కోహ్లీ 113 ప‌రుగులు చేశారు. మొత్తం మీద ఐపీఎల్‌లో 8 సెంచ‌రీలు చేశాడు. ఆ త‌ర్వాత గేల్‌, బ‌ట్లర్ ఉన్నాడు. మొద‌ట్లో కాస్త నెమ్మదిగా ఆడిన విరాట్ కోహ్లీ ఆ త‌ర్వాత మాత్రం రెచ్చిపోయి ఆడాడు. ప్ర‌స్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డ‌ర్‌గా ఉన్న విరాట్ ఈ మ్యాచ్‌లో త‌న ఫామ్ కొన‌సాగించాడు.

Virat Kohli కోహ్లీ ధ‌మాకా బ్యాటింగ్‌

ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో వార్నర్ ఇప్పటివరకు 662 ఫోర్లు బాద‌గా, రాజస్థాన్‌తో మ్యాచ్ ముందు వరకు కోహ్లీ 660 ఫోర్లు బాదాడు. అయితే ఈ మ్యాచ్‌లో బర్గర్ వేసిన రెండో ఓవర్లో 2 ఫోర్లు బాదిన కోహ్లీ.. వార్నర్ రికార్డును సమం చేశాడు. బౌల్ట్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో మరో ఫోర్ బాదిన కోహ్లీ.. వార్నర్ రికార్డును సైతం బద్దలుకొట్టాడు. మొత్తంగా ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శిఖర్ ధావన్ మొదటి స్థానంలో ఉండ‌గా, ధావన్ 766 ఫోర్లు బాదాడు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (562), సురేష్ రైనా( 506), గౌతం గంభీర్ (492), రాబిన్ ఊతప్ప (481), అజింక్య రహానే (462) ఉన్నారు.

Virat Kohli ఐపిఎల్‌ రికార్డు బద్దలు విరాట్ కోహ్లీ 8వ‌ సెంచ‌రీ రాజ‌స్తాన్ టార్గెట్ 184

Virat Kohli : ఐపిఎల్‌ రికార్డు బద్దలు.. విరాట్ కోహ్లీ 8వ‌ సెంచ‌రీ.. రాజ‌స్తాన్ టార్గెట్ 184 ..!

మ‌రోవైపు ఈ మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 7,500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో 7,500 పరుగులు చేసిన మొట్ట మొదటి బ్యాటర్‌గా స‌రికొత్త చరిత్ర సృష్టించాడు. తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటివరకు 242 మ్యాచ్‌లాడిన కోహ్లీ 38 సగటుతో 7,500కు పైగా ప‌రుగులు చేయ‌డం విశేషం. ఆయ‌న ఆడిన మ్యాచ్‌ల‌లో కోహ్లీకి 53 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. అలాగే ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో ఇప్పటివరకు అత్యధికంగా121 పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా కోహ్లీ నిలిచాడు.ఈ రోజు ఆడిన మ్యాచ్‌లో కోహ్లీ 12 ఫోర్స్, 4 సిక్స‌ర్స్ బాదాడు. ఇక ఆర్సీబీ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌కి గాను మూడు వికెట్స్ కోల్పోయి 183 ప‌రుగులు చేసింది. డుప్లెసిన్ 33 బంతుల్లో 44 ప‌రుగులుచేశాడు. మ్యాక్స్ వెల్‌(1) ,కొత్త కుర్రాడు చౌహాన్‌(9) నిరాశ‌ప‌రిచాడు. 184 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్సీబీ..ఆర్ఆర్ కి విధించ‌గా దానిని బీట్ చేస్తుందా లేదా చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది