KCR Helicopter Issue : కేసీఆర్‌కు తప్పిన పెను ప్రమాదం.. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య.. వెనుదిరిగిన సీఎం
KCR Helicopter Issue : సీఎం కేసీఆర్ కు పెను ప్రమాదం తప్పింది. కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య ఏర్పడింది. హెలికాప్టర్ మార్గమధ్యంలో ఉండగా ఈ సమస్య వచ్చింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్ బయలుదేరింది. సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలో ఉంది. దీంతో దేవరకద్రకు సీఎం కేసీఆర్ ఎర్రవల్లి నుంచి స్టార్ట్ అయ్యారు. కానీ.. హెలికాప్టర్ పైకి లేచిన కొద్ది సేపటికే హెలికాప్టర్ […]
ప్రధానాంశాలు:
కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యకు కారణం ఏంటి?
దేవరకద్రకు వెళ్లకుండానే వెనుదిరిగిన సీఎం
మరో హెలికాప్టర్ లో దేవరకద్రకు పయనం

KCR Helicopter Issue : సీఎం కేసీఆర్ కు పెను ప్రమాదం తప్పింది. కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య ఏర్పడింది. హెలికాప్టర్ మార్గమధ్యంలో ఉండగా ఈ సమస్య వచ్చింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్ బయలుదేరింది. సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలో ఉంది. దీంతో దేవరకద్రకు సీఎం కేసీఆర్ ఎర్రవల్లి నుంచి స్టార్ట్ అయ్యారు. కానీ.. హెలికాప్టర్ పైకి లేచిన కొద్ది సేపటికే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్.. హెలికాప్టర్ ను వెనక్కి తిప్పి మళ్లీ ఎర్రవల్లిలోనే ల్యాండ్ చేశాడు. ఈనేపథ్యంలో మరో ప్రత్యామ్నాయ హెలికాప్టర్ ను ఏవియేషన్ సంస్థ ఏర్పాటు చేసింది. దీంతో ఆ హెలికాప్టర్ లో సీఎం కేసీఆర్ దేవరకద్ర పర్యటనకు వెళ్లారు.
సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం కోసం ప్రతి రోజు కొన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో పర్యటించారు. అక్కడ బహిరంగ సభల్లో మాట్లాడి తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ కు ఓటేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. సమయం ఎక్కువగా లేకపోవడం వల్ల రోడ్డు మార్గం ద్వారా కాకుండా నేరుగా బహిరంగ సభ స్థలానికి హెలికాప్టర్ లో వెళ్తున్నారు. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటన ఉంది. ముందుగా దేవరకద్ర వెళ్లి అక్కడి నుంచి ఇతర నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.