Telangana Budget 2023-24: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్..!!
Telangana Budget 2023-24: కొద్ది నిమిషాల క్రితం తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 2023-24 ఏడాదికి సంబంధించి 2,90,395 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ప్రసంగిస్తూ తెలంగాణ బడ్జెట్… దేశానికి ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలియజేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే రైతు రుణమాఫీ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దాదాపు ₹6385 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసినట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు.., రైతుబందు పథకానికి రూ. 1575 కోట్లు, రైతుబీమా పథకానికి రూ. 1589 కోట్లు, నీటి పారుదల రంగం రూ. 26,885 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ. 26,831 కోట్లు, విద్యుత్ రంగానికి రూ. 12,727 కోట్లు, హోంశాఖకు రూ. 9,599 కోట్లు…ఇంకా పలు శాఖలకు సంబందించిన కేటాయింపులు మంత్రి హరీష్ రావు వివరించారు.
సరిగ్గా ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ కావటంతో దాదాపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగించడం జరిగింది. ఈ క్రమంలో రైతు రుణమాఫీ పథకానికి కేసీఆర్ ప్రభుత్వం నిధులు కేటాయించడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.