Telangana Budget 2023-24: తెలంగాణ ఉద్యోగస్తులకు తీపికబురు చెప్పిన ప్రభుత్వం..!!
Telangana Budget 2023-24: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు.. ఉద్యోగులకు తీపికబురు తెలియజేశారు. ఏప్రిల్ నుండి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపడుతున్నట్లు మంత్రి హరీష్ స్పష్టం చేయటం జరిగింది. ఇక ఇదే సమయంలో మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం ₹3వేలకు పెంచారు. ఏప్రిల్ నుండి సెర్చ్ ఉద్యోగులకు పే స్కేల్ సవరణ చేస్తామని ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు కొత్త ఈహెచ్ఎస్ విధానం తీసుకురాబోతున్నట్లు స్పష్టం చేశారు.
అంతేకాదు ఉద్యోగుల కోసం ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పకోచ్చారు. ఇంకా ఈ ఏడాది జూనియర్ మరియు సీనియర్ జిల్లా జడ్జి కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు కొత్తగా నియమించే ఉద్యోగుల జీతభత్యాలకు ₹1000 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలోని కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని గత అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించడం జరిగింది.
ఈ క్రమంలో అధికారులు ఆ దిశగా చర్యలు కూడా చేపట్టారు. కానీ ఆ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు బడ్జెట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని మంత్రి హరీష్ ప్రకటించటంతో త్వరలోనే రెగ్యులర్ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు వరుస పెట్టి నోటిఫికేషన్ లు విడుదల… మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నట్లు తాజా ప్రకటనతో తెలంగాణ యువత కేసిఆర్ ప్రభుత్వం పట్ల సంతోషం వ్యక్తం చేస్తుంది.