KCR vs Kadiyam : కేసీఆర్ వర్సెస్ కడియం.. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం..!
ప్రధానాంశాలు:
KCR vs Kadiyam : కేసీఆర్ వర్సెస్ కడియం.. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం..!
KCR vs Kadiyam : ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎన్నికల పోరు కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనంత ఇంట్రెస్టింగ్ గా ఈ ఎన్నికలు సాగుతున్నాయి. ఎందుకంటే ఈ సారి మాత్రం మూడు పార్టీల నడుమ పోటీ ఉండబోతోందని తెలుస్తోంది. అందుకే ఈ ఎన్నికలు మూడు పార్టీల భవిష్యత్ ను తెలంగాణలో డిసైడ్ చేయబోతున్నాయనే చెప్పుకోవాలి. అయితే ఈ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్లు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లిపోయిన వారు కొందరు ఉన్నారు. అలాంటి వారిలో కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కూడా ఉన్నారు. కడియం కూతురు కావ్యకు కేసీఆర్ వరంగల్ టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన పార్టీ మారిపోయారు.
KCR vs Kadiyam : కడియంకు నేనేం తక్కువ చేయలేదు..
దాంతో ఇప్పుడు కేసీఆర్ ఆయన మీద కోపంగా ఉన్నారు. ఇప్పటి వరకు కడియం పార్టీ మార్పుపై కేసీఆర్ ఎన్నడూ మాట్లాడలేదు. అయితే తాజాగా కడియం శ్రీహరిపై కేసీఆర్ స్పందించారు. తాజాగా ఆయన వరంగల్ లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడియం మీద ఫైర్ అయ్యారు. ఇక్కడ నేను కడియం శ్రీహరి కూతురు కావ్యకు టికెట్ ఇచ్చాను. కడియంకు నేనేం తక్కువ చేయలేదు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చాను. ఎమ్మెల్సీ పదవి ఇచ్చాను. ఇప్పుడు ఎమ్మెల్యేను చేశాను. అయినా సరే నన్ను మోసం చేసి వెళ్లిపోయాడు. ఆయన చేసిన మోసానికి ఆయన రాజకీయ భవిష్యత్ కు ఆయనే సమాధి కట్టుకున్నాడు. మూడు నెలల్లోపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రాబోతున్నాయి.
ఆ ఎన్నికల్లో రాజయ్యను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటా అంటూ ప్రకటించారు సీఎం కేసీఆర్. కడియంకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై అటు కడియం కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మీద నాకు గౌరవం ఉంది. పార్టీ నిర్మాణం చేయాలని ఎన్నోసార్లు సూచించాను.కానీ ఆయన వినలేదు. ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీ నేతలతో అంటకాగుతూ కేసీఆర్ ను నేను మోసం చేయలేకపోయాను. అందుకే నేరుగా పార్టీ మారిపోయాను. అంతే తప్ప కేసీఆర్ ను మోసం చేయాలనే ఉద్దేశం నాకు లేదు అంటూ తెలిపారు కడియం. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్అవుతున్నాయి.