KCR : నోరు జారిన ఎమ్మెల్యే.. అత‌నికి కేసీఆర్ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకాడా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR : నోరు జారిన ఎమ్మెల్యే.. అత‌నికి కేసీఆర్ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకాడా…!

KCR : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల‌లో హాట్ టాపిక్‌గా మారాయి. బతకడానికి వచ్చినోళ్ల ఓట్లు కావాలి కానీ… వారికి టిక్కెట్లు ఇవ్వవద్దా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాటలపై కేసీఆర్ సమాధానం చెప్పాలి” అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నేను తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని… ఎక్కడి నుంచో వచ్చి మా గడ్డ మీద కూర్చొని సవాల్ విసిరితే చూస్తూ కూర్చుంటామా? అని అరికెపూడి […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 September 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  KCR : నోరు జారిన ఎమ్మెల్యే.. అత‌నికి కేసీఆర్ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకాడా...!

KCR : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల‌లో హాట్ టాపిక్‌గా మారాయి. బతకడానికి వచ్చినోళ్ల ఓట్లు కావాలి కానీ… వారికి టిక్కెట్లు ఇవ్వవద్దా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాటలపై కేసీఆర్ సమాధానం చెప్పాలి” అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నేను తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని… ఎక్కడి నుంచో వచ్చి మా గడ్డ మీద కూర్చొని సవాల్ విసిరితే చూస్తూ కూర్చుంటామా? అని అరికెపూడి గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి అన్నారు.ఈ వ్యాఖ్యలను సీఎం తప్పుబట్టారు. ఆయన ఢిల్లీలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

KCR లేనిపోని చిక్కులు..

పీఏసీ పదవిని తాము ప్రతిపక్షానికే ఇచ్చామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ చివరి రోజు బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యను స్పీకర్ ప్రకటించారని, అప్పుడు ఆ పార్టీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. అలాగే 2019 నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ పీఏసీ చైర్మన్‌గా ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉండగా అక్బరుద్దీన్‌కు ఆ పదవిని ఎలా ఇచ్చారో చెప్పాలని నిలదీశారు.సవాల్ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన్ని ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ఆతన ఇంటి నుంచి వెళ్లి గాంధీ ఇంటి వద్ద హడావిడి చేస్తే సమస్యలు ఎదురవుతాయని భావించిన పోలీసులు ఆయన్ని బయటకు రాకుండా కట్టడి చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా అరెస్టు చేసే వేరే ప్రాంతానికి తరలించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.

KCR నోరు జారిన ఎమ్మెల్యే అత‌నికి కేసీఆర్ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకాడా

KCR : నోరు జారిన ఎమ్మెల్యే.. అత‌నికి కేసీఆర్ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకాడా…!

బీఆర్ఎస్ గత పదేళ్ల పాలనలో ఎక్కడా నోరు జారింది లేదు. హైదరాబాద్ లో సెటిలర్ల మద్దతుని అందుకుంది. అందుకే వరసబెట్టి రెండు సార్లు హైదరాబాద్ కార్పొరేషన్ మీద గులాబీ పార్టీ జెండా ఎగరేయగలిగింది. కౌశిక్ రెడ్డి గాంధీ మధ్య వివాదంలో ఆంధ్రులు అంటూ ప్రాంతీయ వాదాన్ని తేవడం పట్ల రచ్చ సాగుతోంది.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గాడి తప్పి జంపింగులు ఫిరాయింపుల కంపు మీద చేస్తున్న పోరాటం కాస్తా చివరికి బూమరాంగ్ అయ్యేలా ఉందని కేసీఆర్ గుర్రు మీద ఉన్నారని టాక్ నడుస్తోంది. తెలంగాణాలో కాంగ్రెస్ పాలన మీద వారి విధానాల మీద పోరాటం చేయకుండా ఏంది ఈ లొల్లి అని కూడా కేసీఅర్ సీరియస్ అయ్యారని అంటున్నారు.ఎంతసేపూ కేటీఆర్ తప్పితే హరీష్ రావు మాత్రమే కాంగ్రెస్ మీద పోరాటానికి ముందుకు వస్తున్నారు. యువ నాయకుడు కదా అని కౌశిక్ రెడ్డిని ముందుకు తెస్తే ఆయన వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు దాంతో మరింత బదనాం అవుతున్నామన్న ఆందోళన అయితే బీఆర్ఎస్ అధినాయకత్వంలో ఉందని అంటున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది