Categories: NewsTelangana

KCR : నోరు జారిన ఎమ్మెల్యే.. అత‌నికి కేసీఆర్ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకాడా…!

Advertisement
Advertisement

KCR : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల‌లో హాట్ టాపిక్‌గా మారాయి. బతకడానికి వచ్చినోళ్ల ఓట్లు కావాలి కానీ… వారికి టిక్కెట్లు ఇవ్వవద్దా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాటలపై కేసీఆర్ సమాధానం చెప్పాలి” అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నేను తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని… ఎక్కడి నుంచో వచ్చి మా గడ్డ మీద కూర్చొని సవాల్ విసిరితే చూస్తూ కూర్చుంటామా? అని అరికెపూడి గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి అన్నారు.ఈ వ్యాఖ్యలను సీఎం తప్పుబట్టారు. ఆయన ఢిల్లీలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

KCR లేనిపోని చిక్కులు..

పీఏసీ పదవిని తాము ప్రతిపక్షానికే ఇచ్చామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ చివరి రోజు బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యను స్పీకర్ ప్రకటించారని, అప్పుడు ఆ పార్టీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. అలాగే 2019 నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ పీఏసీ చైర్మన్‌గా ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉండగా అక్బరుద్దీన్‌కు ఆ పదవిని ఎలా ఇచ్చారో చెప్పాలని నిలదీశారు.సవాల్ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన్ని ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ఆతన ఇంటి నుంచి వెళ్లి గాంధీ ఇంటి వద్ద హడావిడి చేస్తే సమస్యలు ఎదురవుతాయని భావించిన పోలీసులు ఆయన్ని బయటకు రాకుండా కట్టడి చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా అరెస్టు చేసే వేరే ప్రాంతానికి తరలించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.

Advertisement

KCR : నోరు జారిన ఎమ్మెల్యే.. అత‌నికి కేసీఆర్ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకాడా…!

బీఆర్ఎస్ గత పదేళ్ల పాలనలో ఎక్కడా నోరు జారింది లేదు. హైదరాబాద్ లో సెటిలర్ల మద్దతుని అందుకుంది. అందుకే వరసబెట్టి రెండు సార్లు హైదరాబాద్ కార్పొరేషన్ మీద గులాబీ పార్టీ జెండా ఎగరేయగలిగింది. కౌశిక్ రెడ్డి గాంధీ మధ్య వివాదంలో ఆంధ్రులు అంటూ ప్రాంతీయ వాదాన్ని తేవడం పట్ల రచ్చ సాగుతోంది.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గాడి తప్పి జంపింగులు ఫిరాయింపుల కంపు మీద చేస్తున్న పోరాటం కాస్తా చివరికి బూమరాంగ్ అయ్యేలా ఉందని కేసీఆర్ గుర్రు మీద ఉన్నారని టాక్ నడుస్తోంది. తెలంగాణాలో కాంగ్రెస్ పాలన మీద వారి విధానాల మీద పోరాటం చేయకుండా ఏంది ఈ లొల్లి అని కూడా కేసీఅర్ సీరియస్ అయ్యారని అంటున్నారు.ఎంతసేపూ కేటీఆర్ తప్పితే హరీష్ రావు మాత్రమే కాంగ్రెస్ మీద పోరాటానికి ముందుకు వస్తున్నారు. యువ నాయకుడు కదా అని కౌశిక్ రెడ్డిని ముందుకు తెస్తే ఆయన వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు దాంతో మరింత బదనాం అవుతున్నామన్న ఆందోళన అయితే బీఆర్ఎస్ అధినాయకత్వంలో ఉందని అంటున్నారు.

Advertisement

Recent Posts

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

22 mins ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

1 hour ago

Eating Snails : నత్తలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందంటే నమ్ముతారా… కానీ ఇది నిజం… ఎలాగో తెలుసుకోండి…!

Eating Snails : నత్తల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసే ఉంటుంది. అయితే కొన్నిచోట్ల నత్తల కూరను తినడానికి చాలా…

2 hours ago

Zodiac Signs : చంద్రగ్రహణం కారణంగా రేపటి నుండి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు కూడా రాశులకి అశుభ ఫలితాలు ఇస్తాయి. అయితే ఈసారి…

3 hours ago

Liver : ఉదయాన్నే మీరు చేసే చెడు అలవాట్లే… మీ కాలేయాన్ని పాడు చేస్తాయి తెలుసా…!!

Liver :  మన శరీరంలో కాలేయం అనేది ఒక ముఖ్యమైన భాగం. ఇది మన ఆరోగ్యాన్ని రక్షించడంలో ప్రధాన పాత్ర…

4 hours ago

RRC NCR అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2024 : 1679 పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదల..!

RRC NCR : రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, నార్త్ సెంట్రల్ రైల్వే, ప్రయాగ్‌రాజ్, అప్రెంటీస్‌ల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.…

5 hours ago

Married Couples : వైవాహిక జీవితం సాఫీగా సాగాలంటే చాణక్యుడు చెప్పిన ఈ మాటలు వినాల్సిందే… తప్పక తెలుసుకోండి…!

Married Couples : నేటి కాలంలో వైవాహిత జీవితం సజావుగా సాగాలంటే నమ్మకం మరియు సమన్వయం తప్పకుండా ఉండాలి. ఒకవేళ…

6 hours ago

Green Tea : ఈ సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ అస్సలు తాగకూడదట… ఒకవేళ తాగారో… అంతే సంగతి…!!

Green Tea : ప్రస్తుత కాలంలో ఎంతోమంది తమ ఆరోగ్యం పై దృష్టి పెడుతున్నారు. అందుకే బరువు తగ్గడానికి మరియు…

7 hours ago

This website uses cookies.