Komatireddy Venkat Reddy : రేవంత్ చెప్తే ఫైనల్ అవుతుందా? కోమటిరెడ్డి ఫైర్.. రేవంత్‌కు స్ట్రాంగ్ కౌంటర్
Komatireddy Venkat Reddy : అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు వీళ్ల నోటి దూలతోనే పార్టీ పరువును గంగలో కలిపేస్తున్నారు. కాస్తో కూస్తో ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం కలుగుతోంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై ఉన్న ఆ కాస్త నమ్మకాన్ని కూడా పోయేలా నేతలు ప్రవర్తిస్తున్నారు. అసలు వాళ్లలో వాళ్లకే పడదు. ఏం మాట్లాడుతారో అర్థం కాదు. ఇవాళ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. రైతులకు 3 గంటల కరెంట్ మాత్రమే ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి లేచింది. అసలు.. రైతులకు మూడు గంటలే కరెంట్ ఇవ్వడం ఏంటి. మేము 24 గంటలు కరెంట్ ఇస్తుంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు రేవంత్. అసలు ఆయనకు కొంచెమైనా సిగ్గు ఉందా.. ఏం మనిషి.. రైతుల బాధలు పట్టవా.. ఇలాంటి వాళ్లు అధికారంలోకి వచ్చి రైతులను ఆదుకుంటారా అంటూ అధికార బీఆర్ఎస్ పార్టీ భగ్గుమన్నది.ఇక.. వేరే పార్టీల సంగతి పక్కన పెడితే తన సొంత పార్టీ నేతలు, కాంగ్రెస్ నేతలే రేవంత్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాటలకు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Komatireddy Venkat Reddy : సొంత పార్టీ నేతే రేవంత్ పై ఆగ్రహం
రేవంత్ రెడ్డి మాటలు ఆయన వ్యక్తిగతం. ఆయన ఏం చెప్తే అది ఫైనల్ అవుతుందా? కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం అంటూ ఉంటుంది. ఏ నేత ఏం మాట్లాడినా అది ఫైనల్ కాదు. ఒక స్టార్ క్యాంపెయినర్ గా చెబుతున్నా. 24 గంటలు ఉచిత కరెంట్ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. నేను అయినా.. రేవంత్ రెడ్డి అయినా ఇద్దరం పార్టీలో కోఆర్డినేటర్స్ మాత్రమే. సీఎం విషయంలోనూ పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది. సీఎం ఎవరు అనేది పార్టీనే నిర్ణయిస్తుంది.. అని కోమటిరెడ్డి సీఎం అభ్యర్థిపై స్పష్టతనిచ్చారు.