Korutla MLA : గ్రంథాలయాన్ని సందర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే
Korutla MLA : కోరుట్ల : కోరుట్ల పట్టణంలో స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న సి. ప్రభాకర్ స్మారక గ్రంథాలయాన్ని కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ సోమవారం రోజున సందర్శించారు ఈ సందర్భంగా గ్రంథాలయంలో ఉచితంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లో డీఎస్సీ(DSC) పరీక్షలకు చదువుకుంటూ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులతో మాట్లాడారు ఎక్కువ శాతం మహిళలు ఈ పోటీ పరీక్షలలో ఉన్నారని వారికి తన వంతు సహాయంగా పుస్తకాలు అందిస్తామని వివరించారు.

Korutla MLA : గ్రంథాలయాన్ని సందర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే
గత రూపు ఇతర ఎంట్రన్స్ పరీక్షలలో పోటీపడి 18 మంది ఈ గ్రంథాలయంలో చదివి ఉద్యోగాలు సాధించారని అలాగే మీరు కూడా ధైర్యంగా మంచి ఆలోచనతో చదువుకొని ముందుకు రావాలని సూచించారు తదుపరి గ్రంథాలలో ఉన్నటువంటి అన్ని రకాల పుస్తకాలు,దినపత్రికలు, వార్తపత్రికలు, విజ్ఞాన సోపాలు అనేక రకాలైనటువంటి పుస్తకాలను సందర్శించారు ఉచితంగా విద్యార్థులకు సేవలందిస్తున్న సి.ప్రభాకర్ స్మారక గ్రంథాలయ కమిటీని అభినందించారు.
తదుపరి కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని సాల్వతో సన్మానించారు కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు చెన్న విశ్వనాథం, అధ్యక్షులు రాస భూమయ్య,ఉపాధ్యక్షులు సుతారి రాములు,ప్రధాన కార్యదర్శి గోడికే రాజు, సిపిఐ పట్టణ కార్యదర్శి ఎన్నం రాధా స్థానిక సర్పంచులు గోపం లక్ష్మీనారాయణ,అందె వంశీకృష్ణ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు