KTR : కాక‌రేపుతున్న తెలంగాణ రాజ‌కీయం.. బీఆర్ఎస్ నాయ‌కులు త‌గ్గేదే లే అంటున్నారుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KTR : కాక‌రేపుతున్న తెలంగాణ రాజ‌కీయం.. బీఆర్ఎస్ నాయ‌కులు త‌గ్గేదే లే అంటున్నారుగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :21 July 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  KTR : కాక‌రేపుతున్న తెలంగాణ రాజ‌కీయం.. బీఆర్ఎస్ నాయ‌కులు త‌గ్గేదే లే అంటున్నారుగా..!

KTR  : ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయం చాలా వాడివేడిగా సాగుతుంది. ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నామంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. రాజ్యాంగాన్ని అడుగడుగునా తుంగలో తొక్కుతోందంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నిరుద్యోగుల సమస్యలు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవడంపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి గవర్నర్‌ రాధాకృష్ణన్‌‌కు కేటీఆర్‌ ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి, ఇతర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

KTR  రేవంత్ స‌ర్కారుపై ఫిర్యాదు..

అక్రమంగా బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. ఫిరాయింపుపై న్యాయ ప్రక్రియ నడుస్తోందని గవర్నర్‌కు తెలిపామని.. సమస్యలపై గవర్నర్‌ వెంటనే స్పందించారని కేటీఆర్ చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను, 8 మంది ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్‌లోకి చేర్చుకుంటున్న విషయం గురించి గవర్నర్‌కు తెలిపినట్లు కేటీఆర్ చెప్పారు. దీనిపై న్యాయపోరాటం చేస్తున్నామని, ఈ విషయంపై స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు. ప్రొటోకాల్‌ ఉల్లంఘనలకు కూడా గవర్నర్‌కు వివరించినట్లు కేటీఆర్‌ తెలిపారు.

KTR కాక‌రేపుతున్న తెలంగాణ రాజ‌కీయం బీఆర్ఎస్ నాయ‌కులు త‌గ్గేదే లే అంటున్నారుగా

KTR : కాక‌రేపుతున్న తెలంగాణ రాజ‌కీయం.. బీఆర్ఎస్ నాయ‌కులు త‌గ్గేదే లే అంటున్నారుగా..!

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులపై కక్ష కట్టిందని కేటీఆర్ విమర్శించారు. అప్రజాస్వామికంగా విద్యార్థులపై దాడులు, కేసులు పెడుతున్నారని ఆయ‌న‌ ఆరోపించారు. ఉద్యమ సమయంలో ఉన్న పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయని కేటీఆర్ తెలియ‌జేశారు. హామీలను ప్రభుత్వం అమలు చేయట్లేదని గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గ్రంథాలయాల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది