Liquor : మందుబాబులకు డబుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు
ప్రధానాంశాలు:
Liquor : మందుబాబులకు డబుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) కొత్త మద్యం బ్రాండ్ల కోసం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేయగా, దీనికి అనూహ్య స్పందన లభించింది. మొత్తం 92 కంపెనీలు 604 కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేయడం గమనార్హం. ఇందులో భారతీయ మద్యం బ్రాండ్లు 331 కాగా, విదేశీ బ్రాండ్లు 273 ఉన్నాయి. ఈ పరిణామాలు మార్కెట్లో పోటీని పెంచుతాయని, అందువల్ల ధరలు తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Liquor : మందుబాబులకు డబుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు
Liquor : తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు..ఇక కిక్కే కిక్కు
ఇక బీరు సరఫరాలోని సమస్యల పరిష్కారం కోసం కూడా చూస్తున్నారు. ప్రముఖ బీరు తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) సరఫరా నిలిపివేయడంతో మార్కెట్లో కొరత ఏర్పడింది. ఈ సంస్థకు ప్రభుత్వం బకాయిలుగా రూ.658 కోట్లు, మొత్తం మద్యం రంగానికి రూ.3,600 కోట్ల బకాయిలు ఉన్నట్టు సమాచారం. అయితే ఇటీవల ప్రభుత్వం–UBL మధ్య చర్చలు సఫలమవడంతో కింగ్‌ఫిషర్, హైనెకెన్ బ్రాండ్ల సరఫరా మళ్లీ ప్రారంభమైంది. బకాయిల చెల్లింపును దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం మద్యం మార్కెట్‌ను పారదర్శకంగా విస్తరించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త బ్రాండ్ల ఎంపిక ప్రక్రియను ప్రజా అభిప్రాయాలతో ఆన్‌లైన్‌లో నిర్వహించడం, ధరల సవరణపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ సిఫార్సులపై ఆధారపడటం, సంస్థల సరఫరా సామర్థ్యం, నాణ్యతను పరిశీలించడం లాంటి చర్యలు మార్కెట్ స్థిరత్వానికి దోహదపడతాయి. ఈ చర్యలతో వినియోగదారులకు అధిక ఎంపికలు లభిస్తాయి, ధరలు తగ్గుతాయి, అదే సమయంలో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంది.