Ration Cards : రేష‌న్ కార్డ్ లేని వారు చింతించొద్దు.. వారికి రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు బెనిఫిట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ration Cards : రేష‌న్ కార్డ్ లేని వారు చింతించొద్దు.. వారికి రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు బెనిఫిట్

Ration Cards : నిరుద్యోగం చాలా వెంటాడుతోంది. ఏటా వేలమంది పట్టాభద్రులై బయటికి వస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సాధించడం కష్టంగా మారింది. ఇలాంటి సమయాల్లో స్వయం ఉపాధిని కల్పించేందుకు కొన్ని కంపెనీలు ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నాయి. వారికి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి అని అంటున్నారు. అలానే ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టే సంక్షేమ ప‌థ‌కాలు అందాల‌న్నా కూడా రేష‌న్ కార్డ్ క‌లిగి ఉండాలి. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ? ప‌రిస్థితి ఏంట‌ని చాలా […]

 Authored By ramu | The Telugu News | Updated on :2 August 2024,5:00 pm

Ration Cards : నిరుద్యోగం చాలా వెంటాడుతోంది. ఏటా వేలమంది పట్టాభద్రులై బయటికి వస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సాధించడం కష్టంగా మారింది. ఇలాంటి సమయాల్లో స్వయం ఉపాధిని కల్పించేందుకు కొన్ని కంపెనీలు ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నాయి. వారికి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి అని అంటున్నారు. అలానే ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టే సంక్షేమ ప‌థ‌కాలు అందాల‌న్నా కూడా రేష‌న్ కార్డ్ క‌లిగి ఉండాలి. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ? ప‌రిస్థితి ఏంట‌ని చాలా మందికి అనుమానం వ‌స్తుంది. అయితే రేషన్ కార్డు లేని వారికి ఇది ముఖ్యమైన అలర్ట్ అని చెప్పుకోవచ్చు. రేషన్ కార్డు లేని వారికి పూర్తిగా రుణ మాఫీ కావడం లేదు. అలాంటి వారికి గ్రామ పంచాయితీలో కమిటీల ద్వారా కుటుంబ నిర్ధారణ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

Ration Cards : భారీ గుడ్ న్యూస్

అయితే రేష‌న్ కార్డ్ లేని వారు ఆందోళ‌న చెంద‌వ‌ద్దు అని అధికారులు అంటున్నారు. రేష‌న్ కార్డ్ లేని వారికి త్వరలోనే రుణ మాఫీ ప్రయోజనం లభిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే రూ.2 లక్షల వరకు బెనిఫిట్ లభిస్తుంది. కమిటీల ద్వారా నిర్ధారణ పూర్తి అయిన తర్వాత వీరికి మాఫీ అమ‌లు చేసే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌భుత్వం మూడు విడతల్లో రుణ మాఫీ చేస్తుండ‌గా, ఇప్పటికే తొలి, రెండో విడత రుణ మాఫీ పూర్తి అయ్యింది. ఇక మూడో విడత జరగాల్సి ఉండ‌గా, ఆ ధ‌ఫాలో దీని గురించి క్లారిటీ ఇచ్చే అవ‌కాశః ఉంది. మ‌రోవైపు రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకలను అడ్డుకోవడానికి ఆధార్ – రేషన్ కార్డును లింక్ చేయాలని కేంద్రం గతంలో ఆదేశించింది.

ఈ రెండింటి అనుసంధానం వల్ల అర్హులకు ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే రేష‌న్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను ఇక‌పై వేర్వేరుగా జారీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఇటీవ‌ల తెలిపారు. భవిష్యత్తులో తెల్ల రేషన్ కార్డులకు, ఆరోగ్యశ్రీ కార్డులకు లింకు ఉండదని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను రేష‌న్ కార్డు ప్రామాణికం కాద‌ని కూడా చెప్పారు. ఇక నుంచి తెల్ల రేషన్ కార్డులు కేవలం రేషన్ షాపుల్లో సరుకుల సరఫరా కోసం మాత్రమేనని, ఆరోగ్యశ్రీ కార్డులు మాత్రం ప్రైవేట్ హాస్పిట‌ళ్ల‌లో చికిత్స పొందేందుకు ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని ఆయన అసెంబ్లీలో వెల్ల‌డించారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది