BJP Madhavi Latha : పాతబస్తీ నుంచి బీజేపీ అభ్యర్థిగా మాధవి లత… అసలు ఎవరు ఈమె… బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే…!
ప్రధానాంశాలు:
BJP Madhavi Latha : పాతబస్తీ నుంచి బీజేపీ అభ్యర్థిగా మాధవి లత... అసలు ఎవరు ఈమె... బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే...!
BJP Madhavi Latha : హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం అడ్డ అని చెప్పాలి. 2004 నుండి ఈ నియోజకవర్గంలో మజ్లిస్ అధికారం వహిస్తూ వస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ నియోజకవర్గం అసదుద్దీన్ కంచుకోట అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 2004 నుండి వరుసగా నాలుగుసార్లు ఆయనే విజయం సాధించారు. 2004 ,2009, 2014, 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి అసదుద్దీన్ గెలుపొందారు. ఇక అంతకు ముందు 1984 నుండి 2004 వరకు సుల్తాన్ అసదుద్దీన్ అనే వ్యక్తి 6సార్లు ఎంపీగా ఈ నియోజకవర్గ నుండి విజయం సాధించారు. అయితే ఈసారి జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా అసదుద్దీన్ కు చెక్కు పెట్టాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అంతేకాక తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు దక్కటంతో తెలంగాణలో కమలం పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. ఇక ఇదే జోష్ ను కొనసాగిస్తూ పార్లమెంటు స్థానాలను సైతం ఎక్కువగా సాధించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నోటిఫికేషనుకు ముందే తెలంగాణలో తొమ్మిది పార్లమెంటు స్థానాలకు హై కమాండ్ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇక వీరిలో ఒకరు కొంపెల్లి మాధవి లత.ఈమె లోక్ సభ అభ్యర్థి.
అయితే మాధవి లత భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి సోషల్ మీడియాలో మాట్లాడేటటువంటి ఒక మహిళ. ఇలాంటి మహిళలను ఇప్పుడు నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ అభ్యర్థిగా పాతబస్తీలోని అసదుద్దీన్ అనే వ్యక్తి పై పోటీ చేసేందుకు ఎంపీగా దింపుతున్నారు. ఇక ఈ నియోజకవర్గానికి ఈమెను తాజాగా అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. దీంతో ప్రస్తుతం మాధవి లత ఎవరు అనే విషయం రాజకీయపరంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో జనాలంతా మాధవి లత బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని తెలుసుకునేందుకు గూగుల్ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అయితే మాధవి లత ప్రముఖ విరించి ఆసుపత్రుల చైర్ పర్సన్. ఈమె రిలీజియస్ యాక్టివిటీస్ లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. ఇక ఈమె ఎన్ఎసీసీ క్యాడేట్ గా , భరతనాట్య నర్తకి గా , క్లాసికల్ మ్యూజికల్ సింగర్ గా మంచి గుర్తింపు సాధించారు. అంతేకాక ఈమె లతమ్మ ఫౌండేషన్ కు చైర్ పర్సన్ కూడా. భారతదేశానికి చెందినటువంటి సంస్కృతి హిందుత్వం సాంప్రదాయాలపై మాధవి లత అనర్గంగా మాట్లాడగలరు. అయితే మోడీ నాయకత్వానికి ఆకర్షితురాలైన మాధవి లత బీజెపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఇక ఆనాటి నుండి పాతబస్తీలో ఎవరికీ ఎలాంటి సమస్య వచ్చిన సరే పరిష్కరిస్తూ వస్తుంది మాధవి లత. అదేవిధంగా పాతబస్తీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ ప్రజలతో మమేకమై నిత్యం ప్రజల్లో ఉంటున్న మాధవి లతకి టికెట్ ఇస్తేనే బాగుంటుందని రాష్ట్ర నాయకత్వం నుండి ఢిల్లీ పెద్దలకు నివేదిక వెళ్లడంతో మాధవి లతను పాతబస్తీ నియోజకవర్గం నుండి అభ్యర్థిగా పరిశీలించి టికెట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ నియోజకవర్గంలో ఎప్పటినుండే ఎదురులేని నేతగా ఎదురుగుతున్నటువంటి అసద్ ను దెబ్బ కొట్టాలన్నది బీజెపీ ప్లాన్. ఈ క్రమంలోనే ఈసారి అసద్ ను ఓడించాలనే కృషితో నారిశక్తి అయినటువంటి మాధవి లతను బీజెపీ రంగంలోకి దింపింది. అయితే నిజానికి ఇప్పటికే రెండు మూడు సార్లు బీజెపీ అభ్యర్థి ఈ నియోజకవర్గంలో రెండో స్థానం దక్కించుకున్నారు. దీంతో ఈసారి ఎలాగైనా సరే గెలవాలి అనే ఉద్దేశంతో ఆర్థిక బలం , అంగ బలం కలిగి ఉన్నటువంటి మాధవి లతను బీజెపీ బరిలో దింపేందుకు పూనుకుంది. అయితే మజ్లిస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి అసదుద్దీన్ ను హైదరాబాదులోనే కట్టడి చేయాలనేది బీజేపీ పార్టీ లక్ష్యం అని తెలుస్తోంది. మరి బీజేపీ పార్టీ అమలుపరిచిన ఈ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.