Preethi Reddy : యానిమల్ సినిమా గురించి ఫన్నీ కామెంట్స్ చేసిన మల్లారెడ్డి కోడలు..!
Preethi Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డి ఎంత ఫేమసో అందరికీ తెలుసు. అదేవిధంగా ఆయన కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి కూడా అంతే ఫేమస్. ఎన్నికల సమయంలో మామ తరపున ప్రచారం చేసి తనదైన మార్క్ చూపించిన ప్రీతి రెడ్డి మల్లారెడ్డి విద్యా సంస్థల ద్వారా వైద్య, విద్యారంగంలో చేస్తున్న సేవలకు గాను ఆమెకు అరుదైన అవార్డు వచ్చింది. ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించే వారికి ఇచ్చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డు […]
ప్రధానాంశాలు:
Preethi Reddy : యానిమల్ సినిమా గురించి ఫన్నీ కామెంట్స్ చేసిన మల్లారెడ్డి కోడలు..!
Preethi Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డి ఎంత ఫేమసో అందరికీ తెలుసు. అదేవిధంగా ఆయన కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి కూడా అంతే ఫేమస్. ఎన్నికల సమయంలో మామ తరపున ప్రచారం చేసి తనదైన మార్క్ చూపించిన ప్రీతి రెడ్డి మల్లారెడ్డి విద్యా సంస్థల ద్వారా వైద్య, విద్యారంగంలో చేస్తున్న సేవలకు గాను ఆమెకు అరుదైన అవార్డు వచ్చింది. ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించే వారికి ఇచ్చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డు ప్రీతి రెడ్డిని వరించింది. ఇటీవల ముంబైలో ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు కమిటీ చైర్మన్ నందన్ జా ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేసిన అవార్డు ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ ఎన్ హెచ్ఆర్ సి ఇండియా మాజీ చైర్మన్ కే . జి. బాలకృష్ణన్ చేతుల మీదుగా ప్రీతి రెడ్డి అవార్డు అందుకున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వయసులో నాకు అవార్డు రావడం నాకు చాలా ఆశ్చర్యంగా, చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. మామ మల్లారెడ్డి మొదలుపెట్టిన ఉచిత వైద్య విద్య సదుపాయాలను ప్రజలకు అందించడంలో సక్సెస్ అయ్యాం అని అన్నారు. ఇక తనకు సినిమాలు చూసే సమయం ఉండదని, యానిమల్ సినిమాను అసలు చూడలేదని అన్నారు. మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్గా వైద్య విద్యారంగంలో అందరికీ మంచి ఆరోగ్యం అందించడంలో డాక్టర్ గా ప్రీతీ రెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారు. అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ గా మహిళలకు ఉన్నత విద్యను అందించడంలో సహాయపడుతున్నారు. మల్లారెడ్డి హెల్త్ సిటీలో రెండు మెడికల్ కాలేజీలు, రెండు డెంటల్ కాలేజీలు, మల్లారెడ్డి మహిళా కాలేజీ ఉన్నాయి.
ప్రతి మెడికల్ కాలేజీ నుంచి 200 ఎంబిబిఎస్ సీట్లు ప్రత్యేకంగా అమ్మాయిల కోసమే కేటాయిస్తుండడం విశేషం. అత్యున్నత వైద్య సదుపాయాలతో మంచి వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ప్రీతి రెడ్డి డైరెక్టర్ గా ఉన్న మల్లారెడ్డి యూనివర్సిటీ తెలంగాణలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీగా పేరుగాంచింది. అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ కింద స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కూల్ ఆఫ్ హెల్త్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లాంటి ఆరు స్కూల్స్ ఉన్నాయి. ఏటా యూనివర్సిటీ ద్వారా ఐదు వేల మందికి అడ్మిషన్స్ సీట్లు ఇస్తున్నారు. మల్లారెడ్డి కోడలిగా మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్గా మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్గా వైద్య విద్య రిత్య ప్రజలకు విద్యార్థులకు ఎనలేని సేవలు అందిస్తున్నందుకు ప్రీతి రెడ్డికి ఛాంపియన్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డు వరించింది.