Animal Movie Public Talk : యానిమల్ సినిమా మహేష్ బాబు చేసి ఉంటే బాగుండేది ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Animal Movie Public Talk : యానిమల్ సినిమా మహేష్ బాబు చేసి ఉంటే బాగుండేది ..!!

 Authored By aruna | The Telugu News | Updated on :1 December 2023,10:00 pm

ప్రధానాంశాలు:

  •  Animal Movie Public Talk : యానిమల్ సినిమా మహేష్ బాబు చేసి ఉంటే బాగుండేది ..!!

Animal Movie Public Talk : ఈరోజు( డిసెంబర్ 1 ) న విడుదలైన ‘ యానిమల్ ‘ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రన్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించారు. అలాగే అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాతో మరోసారి ప్రభంజనం సృష్టించారు. అర్జున్ రెడ్డి సినిమాలో ప్రేయసి కోసం హీరో ప్రేమ ఎలా ఉంటుందో ఈ యానిమల్ సినిమాలో తండ్రి కోసం కొడుకు ప్రేమ కూడా అదేవిధంగా ఉందని, సందీప్ రెడ్డి వంగా మార్క్ ప్రేమ ఇలానే ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా చూసిన పబ్లిక్ ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

అనిమల్ సినిమా సూపర్ గా ఉంది. బూతులు ఎక్కువగా ఉన్నాయి. రొమాన్స్ సన్నివేశాలు కూడా ఎక్కువగా ఉన్నాయిష అర్జున్ రెడ్డి సినిమాలో కంటే ఈ సినిమాలో లెక్కలేనన్ని లిప్ కిస్ లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ లో కొంచెం సాగదీసి నట్లుగా అనిపించింది. స్టోరీ విషయానికొస్తే భవిష్యత్తులో తండ్రి కొడుకుని చూసుకోకపోతే ఎలా ఉంటదనేది స్టోరీ. ఇక రష్మిక మందన రొమాన్స్ సీన్స్ లో అదరగొట్టేశారు. కొన్ని బూతు పదాలు ఇంగ్లీషులో ఉన్నాయి. అర్జున్ రెడ్డి సినిమాలో లాగే కొన్ని సన్నివేశాలు ఈ సినిమాకి కనెక్ట్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డీసెంట్గా అంతగా ఆకట్టుకోలేదు. ఈ సినిమా ఎక్కువగా యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ సింగిల్ గా వచ్చి చూస్తే బాగుంటుంది అని పబ్లిక్ టాక్.

అడల్ట్ ఇష్టపడే వాళ్ళు రెండు మూడు సార్లు ఈ సినిమాని చూడవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కొద్దిగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయి. రష్మిక మందన తో డీప్ లిప్ కిస్ పెట్టారు. రణ్ బీర్ కపూర్ నటన అద్భుతంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. సెకండాఫ్ లో ఎమోషన్ సీన్స్ బాగా పండాయి. కామెడీ సీన్స్, డబల్ మీనింగ్ డైలాగులు కూడా బాగున్నాయి. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ సూపర్ గా ఉంది. ఆయన ముందు రాజమౌళి కూడా పనికిరారు. అర్జున్ రెడ్డి కన్నా ఈ సినిమా డబల్ గా ఉంది. ఓవరాల్ గా ఈ సినిమా సూపర్ హిట్ అని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది