Musi Project : కాంగ్రెస్ మూసీ ప్రాజెక్ట్ క‌థ ఏంటి.. దాని వ‌ల‌న ఎవ‌రికి లాభం ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Musi Project : కాంగ్రెస్ మూసీ ప్రాజెక్ట్ క‌థ ఏంటి.. దాని వ‌ల‌న ఎవ‌రికి లాభం ?

Musi Project : మూసీ రివర్‌ ఫ్రంట్‌ పేరుతో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌కు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తుండడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హైద‌రాబాద్‌లో నది సుందరీక‌ర‌ణ‌, నీటి శుద్దికి మాత్ర‌మే ఈ ప్రాజెక్ట్. కాని హైద‌రాబాద్ దిగువ‌న ఉన్న ఉమ్మ‌డి రంగారెడ్డి, ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాల‌లో న‌దీ తీరం వెంబ‌డి ఏర్పాటైన ప‌రిశ్ర‌మ‌ల నుండి వ‌చ్చే వ్య‌ర్ధాల‌తో న‌ది నీరు పూర్తిగా క‌లుషితం అవుతుంది. దానిని నివారించ‌డానికి ఎన్నిడిమాండ్స చేసిన […]

 Authored By ramu | The Telugu News | Updated on :30 September 2024,2:15 pm

ప్రధానాంశాలు:

  •  Musi Project : కాంగ్రెస్ మూసీ ప్రాజెక్ట్ క‌థ ఏంటి.. దాని వ‌ల‌న ఎవ‌రికి లాభం ?

Musi Project : మూసీ రివర్‌ ఫ్రంట్‌ పేరుతో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌కు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తుండడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హైద‌రాబాద్‌లో నది సుందరీక‌ర‌ణ‌, నీటి శుద్దికి మాత్ర‌మే ఈ ప్రాజెక్ట్. కాని హైద‌రాబాద్ దిగువ‌న ఉన్న ఉమ్మ‌డి రంగారెడ్డి, ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాల‌లో న‌దీ తీరం వెంబ‌డి ఏర్పాటైన ప‌రిశ్ర‌మ‌ల నుండి వ‌చ్చే వ్య‌ర్ధాల‌తో న‌ది నీరు పూర్తిగా క‌లుషితం అవుతుంది. దానిని నివారించ‌డానికి ఎన్నిడిమాండ్స చేసిన దానిని ప్రాజెక్ట్‌లో చేర్చ‌లేదు. ఎంతో కాలుష్యం జ‌రుగుతున్నా కూడా ఒక్క ఎక‌రానికి నీళ్లు ఇవ్వ‌లేని ప్రాజెక్ట్‌కి రూ.1.50 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు పెట్ట‌డం దోచుకోవ‌డానికి అని అంటున్నారు.

Musi Project మూసీ ప్రాజెక్ట్ బ్యాక్ స్టోరీ..!

మూసీ సుందరీకరణ పేరుతో రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎంత మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందో చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా సాగులోకి వచ్చే ఎకరాలెన్ని? నిల్వ ఉంచే టీఎంసీలెన్ని ? పెరిగే పంటల దిగుబడి ఎంత? తీర్చే పారిశ్రామిక అవసరాలెంత? కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లు ఎన్ని అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 80 వేల కోట్లయితేనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. లండన్‌లోని థేమ్స్‌లాగా మారుస్తామనే వ్యూహం వెనక థీమ్‌ ఏంటి ? గేమ్‌ ప్లాన్‌ ఏంటీ? అని కేటీఆర్‌ నిలదీశారు. ముఖ్యమంత్రికి కనీసం తను పుట్టిన గడ్డ మీద కూడా మమకారంలేదని కేటీఆర్‌ ఆరోపించారు.

Musi Project కాంగ్రెస్ మూసీ ప్రాజెక్ట్ క‌థ ఏంటి దాని వ‌ల‌న ఎవ‌రికి లాభం

Musi Project : కాంగ్రెస్ మూసీ ప్రాజెక్ట్ క‌థ ఏంటి.. దాని వ‌ల‌న ఎవ‌రికి లాభం ?

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకన్నా మూసీ ప్రాజెక్టుపైనే ముఖ్యమంత్రి ఎందుకు ఎకువ మకువ చూపుతున్నారని ప్రశ్నించారు. చివరి దశలో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కోల్డ్‌ స్టోరేజీలోకి నెట్టి మూసీ చుట్టే తిరగటం వెనుక దాగిన ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వేల కోట్లను దోచుకునేందుకే మూసీ పేరుతో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ పేరిట బ్యాక్‌ డోర్‌లో జరుగుతున్న బాగోతాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని చెప్పారు. చివరి దశలో ఉన్న’పాలమూరు’ను పక్కన పెట్టిన, కోల్డ్‌ స్టోరేజీలోకి నెట్టేసి.. మూసీ చుట్టే ఎందుకీ మంత్రాంగం ప్రశ్నించారు. లండన్‌ లోని థేమ్స్‌ లాగా మారుస్తామనే వ్యూహం వెనుకున్న థీమ్‌ ఏంటి.. గేమ్‌ ప్లాన్‌ ఏంటి అని నిలదీశారు. మూసీ అంచనా వ్యయం మూడింతలు పెంచడం కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యమని అన్నారు

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది