Tomato Farmer : పదో తరగతి ఫెయిల్.. టమాటాల సాగు చేస్తూ కోట్లు సంపాదించాడు.. ఎక్కడో తెలుసా?
Tomato Farmer : టమాటా అని మనం ఇప్పుడు ఛీప్ గా తీసేసే పరిస్థితి లేదు. అవును.. ఒకప్పుడు టమాటా పది రూపాలయకు కిల ఉండేది. రెండు మూడు నెలల కింద కూడా 10, 20 రూపాయలకు కిలో టమాటా ఉండేది. కానీ.. ఇప్పుడు 150 రూపాయలకు పైనే కిలో టమాటా పలుకుతోంది. అందుకే.. టమాటా రైతులు ఒక్కసారి లక్షాధికారులు, కోటీశ్వరులు అవుతున్నారు. కంటిన్యూగా గత నెల రోజుల నుంచి టమాటా ధరలు పెరుగుతూ వచ్చాయి. కొన్ని చోట్ల 200 వరకు ధర పలుకుతోంది. దాని వల్ల కొందరు టమాటా రైతులు బాగా డబ్బు సంపాదిస్తున్నారు.
అలా మెదక్ జిల్లాకు చెందిన ఓ రైతు నెల రోజుల్లోనే ఏకంగా కోట్లు సంపాదించాడు. జిల్లాలోని కౌడిపల్లికి చెందిన రైతు మహిపాల్ రెడ్డి 8 ఎకరాల్లో 20 ఏళ్లుగా టమాటా సాగు చేస్తున్నాడు. ఈ సీజన్ లో ఆయన 7 వేల బాక్సుల టమాటాను పండించాడు. ఒక్క బాక్సును రూ.2600 కు విక్రయించడంతో ఒకేసారి ఆయనకు కోట్లు వచ్చి పడ్డాయి. ఆ యువ రైతు వయసు 36 ఏళ్లు.
Tomato Farmer : పది ఫెయిల్ అయినా వ్యవసాయంలో సక్సెస్ అయ్యాడు
తనకు చిన్నప్పుడు చదువు అబ్బలేదు. 10లో ఫెయిల్ అయ్యాడు. కానీ.. వ్యవసాయం అంటే ఇష్టం. అందుకే వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. దాని మీదనే దృష్టి సారించి.. తన భార్య సాయంతో కూరగాయల సాగు ప్రారంభించాడు. 8 ఎకరాల్లో టమాటా పంట సాగు చేస్తూ ఉండటం వల్ల టమాటా ధరలు ఒక్కసారిగా పెరగడం మహిపాల్ రెడ్డికి కలిసి వచ్చింది. అందుకే నెల రోజుల్లో కోటీశ్వరుడు అయ్యాడు. వ్యవసాయాన్ని నమ్ముకున్నవాళ్లకు, భూమిని నమ్ముకున్న వాళ్లకు ఎన్నడూ అన్యాయం జరగదు.. అని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ.