Medchal BJP : మేడ్చల్ బిజెపి బస్తీ బాటలో – వైయస్సార్
ప్రధానాంశాలు:
Medchal BJP : మేడ్చల్ బిజెపి బస్తీ బాటలో - వైయస్సార్
Medchal BJP : వికసిత భారత్ అభియాన్ లో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వేగవంతమైన అభివృద్ధికి కంకనబద్దులై పనిచేస్తున్న మోదీ గారి కృషిని తెలంగాణలోని ప్రతి బస్తీకి,పల్లెకు చేరవేసే లక్ష్యంతో బిజెపి నాయకులం కార్యకర్తలందరం పనిచేయబోతున్నామని పేర్కొన్న బిజెపి మేడ్చల్ నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి మరియు బిజెపి జవహర్ నగర్ వెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కమల్. బిజెపి జవహర్ నగర్ వెస్ట్ అధ్యక్షులు కమల్ అధ్వర్యంలో బీజేపీ గావ్ ఛలో బస్తీ ఛలో కార్యక్రమంలో భాగంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులతో కలిసి వివిధ బస్తీలో ప్రజలను కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాలను గూర్చి అవగాహన కల్పించడం జరిగింది.

Medchal BJP : మేడ్చల్ బిజెపి బస్తీ బాటలో – వైయస్సార్
Medchal BJP ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
– నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు…
– ప్రధానమంత్రి గరీబ్ అన్న కళ్యాణ యోజన పథకం ద్వారా 6 కిలోల ఉచిత బియ్యం డబ్బులు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తున్న ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని దాస్తుంది..
– మహిళల తమ సొంత కాళ్లపై నిలబడి ఉపాధి పొందేందుకు ఎటువంటి తాకట్టులేని రుణాలను ముద్రా యోజన పథకం ద్వారా అందిస్తున్నారు..
– మహిళల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేలా కోట్లాది మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది..
– ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు…
– దేశంలో లక్షలాది కిలోమీటర్ల నూతన రైల్వే లైన్లు..
– పెద్ద ఎత్తున జాతీయ రహాదారులు..
– ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల పై ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల మొన్నటి వరకు భారస,ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల మోస పూరిత మాటలు నమ్మి ఆయా పార్టీలకు ఓట్లు వేయడం వల్ల ఇంకా పెద్ద ఎత్తున జరగాల్సిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమల్లోకి రావడం లేదు….
– ఇకనుండి అయిన మార్పు వచ్చి ప్రజలు బిజెపిని ఆదరించాలి…