TSRTC MD Sajjanar : ఇటీవల చాలా మంది ప్రాణాలు పణంగా పెట్టి జర్నీలు చేస్తున్నారు.అయితే ఎవరు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా వాటిని పెడ చెవిన పెడుతున్నారు. అయితే తాజాగా ఇలాంటి పరిస్థితులు గమనించిన తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సామాజిక మాధ్యమంలో అలాంటి వారికి హెచ్చరికలు జారీ చేశాడు. తాజాగా మండుటెండలో ఓ వ్యక్తి బైక్‌పై ఆరుగురిని (ఆయనతో కలిపి ఏడుగురు) ఎక్కించుకుని ప్రయాణిస్తున్నాడు. వారిలో ఐదుగురు చిన్నారులు కాగా, వారి ప్రయాణం చాలా భయంకరంగా సాగుతుంది.
అయతే బైక్‌పై ముగ్గురు ప్రయాణించడమే నేరమైన వేళ ఏకంగా ఏడుగురితో ప్రయాణిస్తూ అందరిని భయభ్రాంతులకి గురి చేశాడు. అయితే అనుకోని ప్రమాదం సంభవిస్తే వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఊహకే భయంకరంగా ఉందంటూ నెటిజన్లు ఈ ఫొటోపై కామెంట్ చేస్తున్నారు. ఈ క్లిప్‌ను షేర్ చేసిన సజ్జనార్.. మండుటెండలో ఒక్క బైక్‌పై ఇంతమందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ప్రాణాలను పణంగా పెట్టి చేసే ఇలాంటి ప్రమాదకరమైన బైక్ ప్రయాణం ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదని సజ్జనార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చిన్నారుల విషయంలో కొందరు తల్లిదండ్రులు ఇలా ప్రవర్తించడం బాధాకరమని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు.
సజ్జనార్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆయన తరచు రోడ్డు ప్రమాదాలకి సంబంధించిన విషయాలని షేర్ చేస్తూ ఉంటారు. ముంబైలో ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాద విజువల్స్ ను ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. రోడ్డు దాటుతున్న ఇద్దరు యువతులను ఓ కారు అతివేగంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోవడం అందులో ఉండగా, ఈ ఘటనలో యువతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏమిటని నెటిజన్లను సజ్జనార్ ప్రశ్నించారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్ స్పీడా? లేక పాదచారుల అజాగ్రత్త కారణమా అని అడుతుగూ… తన పోస్ట్ కు రోడ్ సేఫ్టీ, ఓవర్ స్పీడ్, రోడ్ యాక్సిడెంట్, రోడ్, డ్రైవ్ సేఫ్, పెడెస్ట్రియన్, డ్రైవ్ స్లో సేవ్ లైఫ్ అనే పదాలను హ్యాష్ ట్యాగ్ లుగా జత చేశారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.