Anganwadis : అంగన్వాడీలకు రేవంత్ సర్కార్ శుభవార్త.. రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఇస్తూ వరాల జల్లు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anganwadis : అంగన్వాడీలకు రేవంత్ సర్కార్ శుభవార్త.. రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఇస్తూ వరాల జల్లు..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 July 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Anganwadis : అంగన్వాడీలకు రేవంత్ సర్కార్ శుభవార్త.. రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఇస్తూ వరాల జల్లు..!

Anganwadis : తెలంగాణా సర్కారు అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు శుభవార్త చెప్పింది. అంగన్వాడీలు ఎప్పటి నుంచో చేస్తున్న ఆందోళనలకు ప్రభుత్వం వారికి మంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని ప్రకటించిని. అంగన్వాడీ టీచర్లకు పదవీ విరమణ తర్వాత 2 లక్షలు, హెల్పర్ల 1 లక్ష చూప్పున ఇచ్చేలా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు మూడు రోజుల్లోనే జీవో విడుదల చేస్తారని తెలుస్తుంది.
హైదరాబాద్ రెహమత్ నగర్ లో అమ్మ మాట అంగన్వాడీ బాట అనే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క అంగన్వాడీ రిటైర్మెంట్ బెనిఫిస్ పై స్పందించారు.. టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేలా రెండు మూడు రోజుల్లోనే జీవో రిలీజ్ చేస్తామని అన్నారు. ఎన్నికల టైం లో అంగన్వాడీలు తమకు న్యాయం చేయాలని కోరారు. ఐతే వారికి హామీ ఇచ్చినట్టుగానే ప్రహుత్వం వారికి వరాల జల్లు కురిపించింది.

Anganwadis బీ ఆర్ ఎస్ అంగన్వాడీల ఇబ్బందులు..

బీ ఆర్ ఎస్ అధికారం లో ఉన్నప్పుడు అంగన్వాడీలకు సరిగా జీతాలు కూడా పడలేదని.. కాంగ్రెస్ పాలనలో వారికి 1వ తేదీనే జీతాలు పడుతున్నాయని మంత్రి సీతక్క చెప్పారు. ఐతే ఇంకా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు నాయపరమైన డిమాండ్లు నెరవేరుస్తామని అన్నారు. సీతక్క ప్రకటనతో అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీవో నెంబర్ 10 రద్ధు తో పాటుగా అంగన్వాడీల సమస్యల పట్ల మంత్రి సీతక్క సామరస్యపూర్త్వకంగా స్పందించారని చెబుతున్నారు. మిగతా సమస్యల కూడా త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని వారు నమ్ముతున్నారు.

Anganwadis అంగన్వాడీలకు రేవంత్ సర్కార్ శుభవార్త రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఇస్తూ వరాల జల్లు

Anganwadis : అంగన్వాడీలకు రేవంత్ సర్కార్ శుభవార్త.. రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఇస్తూ వరాల జల్లు..!

జీవో నెంబర్ 10 రద్ధు చేయాలని అంగన్వాడీలు ఎమ్మెల్యేల క్యాప్ కార్యాలయాలు ముట్టడించారు. అంగన్వాడీలకు మానిఫెస్టోలో ప్రకటించిన 18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐతే మంత్రి సీతక్క వేతనాల పెంపుపై మాట్లాడలేదు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి వారి సమ్మెను తాత్కాలికంగా ఆగిపోయేలా చేశారు. వీటితో పాటుగా పెన్షన్ ని 5 వేలు చేయాలని అంగన్వాడీలు కోరుతున్నారు. ఐతే ప్రస్తుతానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రమే ఇచ్చిన సీతక్క మిగిలిన వాటిపై మరోసారి చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది