Minister Seethakka : కేటీఆర్ కి చెమటలు పట్టించిన కాంగ్రెస్ మంత్రి సీతక్క..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Minister Seethakka : కేటీఆర్ కి చెమటలు పట్టించిన కాంగ్రెస్ మంత్రి సీతక్క..??

Minister Seethakka : గురువారం నాడు గాంధీభవన్లో కాంగ్రెస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి సీతక్క పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఫ్యూడల్ పార్టీ అని, అధికారం లేకుండా బీఆర్ఎస్ నాయకులు బతకలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మాది గడీల పాలన కాదని, గల్లీ బిడ్డల పాలన అని, మా ప్రభుత్వానికి ప్రజల మద్దతు చూసి బీఆర్ఎస్ నేతలు భయపడి మాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. […]

 Authored By aruna | The Telugu News | Updated on :5 January 2024,3:00 pm

Minister Seethakka : గురువారం నాడు గాంధీభవన్లో కాంగ్రెస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి సీతక్క పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఫ్యూడల్ పార్టీ అని, అధికారం లేకుండా బీఆర్ఎస్ నాయకులు బతకలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మాది గడీల పాలన కాదని, గల్లీ బిడ్డల పాలన అని, మా ప్రభుత్వానికి ప్రజల మద్దతు చూసి బీఆర్ఎస్ నేతలు భయపడి మాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు అందజేస్తుంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇది తట్టుకోలేని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్పై దుష్ప్రచారం చేస్తున్నారు అని సీతక్క వ్యాఖ్యానించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏకకాలంలో రుణమాఫీ అన్నారని, అది ఏమైందని ప్రశ్నించారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోపిడి దొంగలు దోచుకున్నారని, బీఆర్ఎస్ పార్టీ 420 అనే ప్రజలు ఓడగొట్టారు అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కూల్చేస్తాం, పేలుస్తామంటున్నారని మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో వాళ్ళని బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టి వాళ్లతో నిరసనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉచిత బస్సు ఆలోచన రాగానే ఆటో డ్రైవర్లతో మొదటగా మాట్లాడిన తర్వాతనే మేనిఫెస్టోలో పెట్టినట్లు చెప్పారు. ఆ పార్టీ దోచుకున్నదంతా బయటకి వస్తుంది అని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బడ్జెట్ బారెడు ఖర్చు చారెడు అని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ శ్వేత పత్రంఎక్కడిదని ఎవడు కష్టపడ్డారని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాదు భ్రమ తెలంగాణ చేశారు అని సీతక్క అన్నారు. బంగారు తెలంగాణ పేరు చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకుంది బీఆర్ఎస్ నాయకులు భారం మోయాల్సింది తెలంగాణ ప్రజల అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు అప్పు చేస్తే తెలంగాణ ఎందుకు సిగ్గుపడాలని మంత్రి సీతక్క నిలదీశారు. బీఆర్ఎస్ బంగారు తెలంగాణ అని పేరు చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని అది గ్రహించిన ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టిందని సీతక్క వ్యాఖ్యానించారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది