Uttam Kumar Reddy : కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి వెనుక ఎవరు ఉన్నా అస్సలు వదిలేదే లేదు.. మంత్రి ఉత్తమ్ వార్నింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Uttam Kumar Reddy : కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి వెనుక ఎవరు ఉన్నా అస్సలు వదిలేదే లేదు.. మంత్రి ఉత్తమ్ వార్నింగ్

 Authored By kranthi | The Telugu News | Updated on :12 December 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది

  •  కేబినేట్ స్థాయిలో విచారణకు ఆదేశిస్తాం

  •  ఇప్పుడే అన్ని వివరాలు సేకరిస్తున్నాం

Uttam Kumar Reddy : తెలంగాణలో వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని చాలా రోజుల నుంచి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అన్ని వేల కోట్లు పెట్టి నిర్మిస్తే ఎందుకు అంత నాసిరకంగా కట్టడాలు ఉన్నాయి. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టే ప్రాజెక్టులు ఇలా ఉంటాయా? అంటూ ఓవైపు విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. కొత్త ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఆయన మంత్రి కాగానే ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ పై సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఇప్పటికే అధికారులను అడిగి తెలుసుకున్నామని ఉత్తమ్ తెలిపారు. డిటెయిల్ వివరణ అడిగాం. దాని మీద ఎంత నష్టం జరిగింది అనే దానిపై ఆరా తీస్తున్నాం అన్నారు మంత్రి ఉత్తమ్.

ప్రతి ప్రాజెక్ట్ కొత్త ఆయకట్టుకు సంబంధించిన వివరాలు కావాలని అధికారులను అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కొత్త ఆయకట్టు గురించి, ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ప్రాజెక్టు కాస్ట్, పవర్ కాస్ట్ ఎంత పడుతోంది. కోట్లాది మంది ప్రజల నమ్మకం, వాళ్ల కష్టంతో కడుతున్నాం. ఒక్క రూపాయి కూడా వేస్ట్ కావద్దు.. అని అధికారులు ఉత్తమ్ తెలిపారు. పెద్ద ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్త వహించాలని.. సొరంగం పనులపై కూడా అడిగాం. వాళ్లకు జయప్రకాష్ కంపెనీకి, ఫండ్స్ ఇవ్వనందుకు ప్రాజెక్ట్ పనులు పూర్తిగా ఆగిపోయాయి అని చెప్పారు. నేను వెంటనే ఆ ఫండ్స్ రిలీజ్ చేసి పనులు మళ్లీ ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు.

Uttam Kumar Reddy : కాళేశ్వరంపై కేబినేట్ లేవల్ లో విచారణ చేస్తాం

కాళేశ్వరంపై కేబినేట్ లేవల్ లో విచారణ చేయిస్తాం. చుట్టు పక్కన అన్ని రాష్ట్రాలతో మంచి సంబంధం ఉండేలా చూసుకుంటాం. అలాగే ముందుకు వెళ్తాం. పోలింగ్ డే రోజే నాగార్జున సాగర్ వివాదం తెరమీదికి వచ్చింది. చాలా ప్రాజెక్టులకు ఎంత ఖర్చు అయింది. ఎంత ఆయకట్టు ఉంది.. అనే దానిపై డీప్ గా ఫిగర్స్ నాకు రాలేదు. తెలంగాణ రాష్ట్ర పురోగతిలో ఇరిగేషన్ శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. డిటెయిల్ గా ప్రాజెక్ట్ వారీగా రివ్యూ కూడా ఉంటుంది అని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది