Vakiti Srihari : మంత్రి పదవి పై మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వీడియో..!
ప్రధానాంశాలు:
మహాప్రభో.. నాకు ఇచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయి : మంత్రి వాకిటి శ్రీహరి
Vakiti Srihari : మంత్రి పదవి పై మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వీడియో..!
Vakiti Srihari : తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంత్రిగా తనకు కేటాయించిన శాఖలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. “నాకు ఇచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయి. ఇవి నాకు అదృష్టమో లేక దురదృష్టమో తెలియదు” అంటూ వ్యాఖ్యానించారు. పదేళ్లుగా ఆగిపోయిన శాఖలను తనకు అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
Vakiti Srihari : మంత్రి పదవి పై మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
Vakiti Srihari : మంత్రి పదవి రావడం నా అదృష్టమో లేక దురదృష్టమో తెలియడం లేదు : మంత్రి వాకిటి శ్రీహరి
ప్రస్తుతం ఆయన పశుసంవర్ధక శాఖతో పాటు మరో అయిదు శాఖలకు బాధ్యత వహిస్తున్నారు. అయితే ఈ శాఖలన్నీ అంతగా ప్రాధాన్యం లేని విధంగా ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. “యువజన సేవల శాఖ ఇస్తే నేనేం చేసుకోవాలి? గొర్రెలు, బర్రెలు ఇస్తే నేనే వాటితో ఏం చేసుకోను?” అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇలా నేరుగా తన బాధ్యతలపై అసహనం వ్యక్తం చేయడం పలు రాజకీయ సందేహాలకు దారితీస్తోంది.
వాకిటి శ్రీహరి వ్యాఖ్యలు తన శాఖలపై నిరాశను వెల్లడించేలా ఉండటమే కాకుండా, రాష్ట్ర కేబినెట్‌లో ఉన్న అంతర్గత అసంతృప్తిని కూడా హైలైట్ చేస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో, తదుపరి మార్పులు ఉంటాయా అన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
నాకు ఇచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయి
ఇది నా అదృష్టమో లేక దురదృష్టమో తెలియదు
పదేళ్లలో ఆగమైన శాఖలను నాకు కేటాయించారు
పశుసంవర్ధక శాఖతో పాటు మరో 5 శాఖలు ఆగమాగం ఉన్నాయి
యువజన సర్వీసులు ఇస్తే నేనేం చేసుకోవాలి?
గొర్రెలు, బర్రెలు ఇస్తే… pic.twitter.com/Z0wwTBY4qa
— BIG TV Breaking News (@bigtvtelugu) July 7, 2025