T Padma Rao Goud : బిగ్ బ్రేకింగ్.. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు
ప్రధానాంశాలు:
T Padma Rao Goud : సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటు
T Padma Rao Goud : సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురయ్యారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ పర్యటనలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. స్థానిక ఆసుపత్రిలో అత్యవసర యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. సమాచారం ప్రకారం.. మినిమల్లీ ఇన్వాసివ్ ప్రక్రియ సమయంలో స్టెంట్ ఉపయోగించబడింది. ప్రాణాపాయం ఏం లేదని వైద్యులు తెలిపారు.
T Padma Rao Goud సర్జరీ విజయవంతం
దగ్గరి బంధువులతో కలిసి పద్మారావు గౌడ్ డెహ్రాడూన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ గుండెపోటుకు గురవ్వడంతో బంధువులు వెంటనే స్పందించి ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ విజయవంతంగా జరిగింది. పద్మారావు గౌడ్ ఆరోగ్యం నికలడగా ఉందని, పూర్తిగా కోలుకున్నారని వైద్యులు తెలియజేయడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. పద్మారావు గౌడ్‌కు గుండెపోటు వచ్చిందన్న కథనాలతో బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు షాక్‌కు గురైయ్యారు. మరోవైపు, పద్మారావు గౌడ్ ఇవాళ రాత్రికి సికింద్రాబాద్‌కు తిరిగి వస్తున్నారని తెలియడంతో ఆయన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు పద్మారావు ఇంటికి చేరుకుంటున్నారు.
పద్మారావు గౌడ్ రాజకీయ జీవితం
పద్మారావు గౌడ్ గ్రేటర్ హైదరాబాద్‌లో బలమైన నేత. ఆయన మున్సిపల్ కౌన్సిలర్ స్థాయి నుంచి అంచలంచలుగా రాజకీయాల్లో ఎదిగారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. 2004లో తొలిసారి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2009 ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014 నుంచి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014 నుంచి 2018 వరకు ఎక్సైజ్, స్పోర్ట్స్ శాఖ మంత్రిగా, 2019 ఫిబ్రవరి 24 నుంచి తెలంగాణ రెండో అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు.