Vedma Bojju : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. రేవంత్ సర్కార్ కు కొత్త తలనొప్పి..!
ప్రధానాంశాలు:
అదే జరిగితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తునంటున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
Vedma Bojju : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. రేవంత్ సర్కార్ కు కొత్త తలనొప్పి..!
Vedma Bojju : తెలంగాణ ఖానాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఒక కీలక ప్రకటన చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన జీవో 49ను మళ్లీ తీసుకొస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తేల్చిచెప్పారు. గిరిజన హక్కులను ఖాతర చేయకుండా తీసుకొచ్చిన ఆ జీవోను తిరిగి ప్రవేశపెడతారన్న భయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా గిరిజనుల హక్కులను కాపాడటం తన బాధ్యతనని, అవసరమైతే త్యాగానికి కూడా వెనుకాడనని అన్నారు.

Vedma Bojju : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. రేవంత్ సర్కార్ కు కొత్త తలనొప్పి..!
Vedma Bojju : జీవో 49 మళ్లీ తెస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని హెచ్చరిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై బొజ్జు తీవ్రంగా స్పందించారు. “అటవీ శాఖ అధికారులు అడవిలో నుంచి కలప తరలింపును నియంత్రించలేకపోతున్నారు. వేలాది రూపాయల విలువైన కలప ఎలా మాయమవుతోంది?” అంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులను అటవీ అధికారులు వేధిస్తున్నారని విమర్శించారు. అడవుల్లో గొర్రెలు, బర్రెలతో కాపరిచే గిరిజనులను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
పోడు భూముల విషయంలో గిరిజనుల హక్కులను ఖచ్చితంగా రక్షిస్తానని స్పష్టం చేసిన వెడ్మ బొజ్జు, ప్రభుత్వం గిరిజనుల భూములపై దాడులకు పాల్పడితే గిరిజనుల తిరుగుబాటుకు తానే నాయకత్వం వహిస్తానన్నారు. ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదని, ప్రజల హక్కుల కోసం జరిగే పోరాటమని చెప్పారు. తన రాజకీయ జీవితం అంతా గిరిజనుల అభ్యున్నతికి అంకితమైందని పేర్కొంటూ, ఈ విషయంలో రాజీ ఉండదని తేల్చి చెప్పారు.